Alexei Navalny: ఎట్టకేలకు నావల్నీ మృతదేహం అప్పగింత!

రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ మృతదేహాన్ని ఎట్టకేలకు కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు తెలుస్తోంది.

Published : 24 Feb 2024 22:21 IST

మాస్కో: రష్యా అధ్యక్షుడు పుతిన్‌ విమర్శకుడు, ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ (Alexei Navalny) మృతదేహాన్ని ఎట్టకేలకు ఆయన తల్లికి అప్పగించినట్లు తెలుస్తోంది. ఆయన ప్రతినిధి కిరా యార్మిష్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ నెల 16న ఆర్కిటిక్‌ పీనల్‌ కాలనీలో నావల్నీ మరణించినట్లు అధికారులు వెల్లడించినప్పటికీ.. భౌతిక కాయం ఎక్కడుందో తెలియకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంలో ప్రభుత్వ తీరుపై పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి.

‘కేజీబీ వన్‌-పంచ్‌’ టెక్నిక్‌తో నావల్నీని చంపేశారా?

మృతదేహాన్ని కావాలనే దాచిపెడుతున్నారని ఆయన మద్దతుదారులు ఆరోపించారు. తన కుమారుడిని కడసారి చూసేందుకు అవకాశం ఇవ్వాలని తల్లి లియుడ్మిలా దేశాధ్యక్షుడు పుతిన్‌ను వేడుకున్నారు. గౌరవప్రదంగా ఖననం చేసేందుకు భౌతిక కాయాన్ని అప్పగించాలని కోరారు. ఈ క్రమంలోనే సలేఖార్ద్‌ నగరంలో ఆమెకు మృతదేహాన్ని అప్పగించినట్లు సమాచారం. అయితే.. రహస్యంగా ఖననం చేయాలని అధికారులు ఇప్పటికే తనపై ఒత్తిడి తీసుకువచ్చారని నావల్నీ తల్లి వాపోయారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని