Netanyahu: కాల్పుల విరమణకు ‘నో’.. ఇది నాగరికత-అనాగరికతకు మధ్య పోరు : నెతన్యాహు

హమాస్‌ ఉగ్రవాదులను తుదముట్టించే ప్రయత్నంతోనే ముందుకు వెళ్తామని ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహు స్పష్టం చేశారు.

Published : 31 Oct 2023 18:29 IST

టెల్‌ అవీవ్‌: హమాస్‌ మిలిటెంట్లతో కాల్పుల విరమణకు (Ceasefire) అంగీకరించే ప్రసక్తే లేదని ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహు స్పష్టం చేశారు. అదే జరిగితే ఉగ్రవాదుల ముందు ఇజ్రాయెల్‌ లొంగిపోవాలని చెప్పినట్లే అవుతుందన్నారు. హమాస్‌ ఉగ్రవాదులను తుదముట్టించే ప్రయత్నంతోనే ముందుకు వెళ్తామని ఉద్ఘాటించారు. ఏ యుద్ధమైనా సామాన్య పౌరుల ప్రాణాలను కోరుకోదన్నారు. గాజాలో ఇజ్రాయెల్ చేస్తోన్న యుద్ధం (Israel Hamas conflict).. నాగరితక-అనాగరికతకు మధ్య జరుగుతోన్న పోరు అని అన్నారు.

హమాస్‌తో యుద్ధం జరుగుతోన్న వేళ ఐక్యరాజ్య సమితి సాధారణ సభలో ప్రవేశపెట్టిన ‘మానవతా సంధి’ తీర్మానం లోపభూయిష్ఠంగా ఉందని బెంజమిన్‌ నెతన్యాహు పేర్కొన్నారు. ఇజ్రాయెల్‌లో జరిగినటువంటి దారుణాలను ఏ నాగరిక దేశం కూడా సహించదని పేర్కొన్నారు. కాల్పుల విరమణకు ఇజ్రాయెల్‌ అంగీకరించదన్నారు.

Pentagon: హిరోషిమా కంటే 24 రెట్ల శక్తిమంతమైన అణుబాంబు!

కాల్పుల విరమణకు పిలుపునివ్వడం.. హమాస్‌ ముందు, ఉగ్రవాదం ముందు, అనాగరికత ముందు ఇజ్రాయెల్‌ లొంగిపోవాలని చెప్పినట్లే అవుతుందని బెంజమిన్‌ నెతన్యాహు స్పష్టం చేశారు. పెరల్‌ హార్బర్‌, 9/11 ఉగ్రదాడుల అనంతరం అమెరికా ఎలాగైతే కాల్పుల విరమణకు అంగీకరించలేదో.. ఇజ్రాయెల్‌ కూడా ఇందుకు అంగీకరించదన్నారు. ఈ యుద్ధం తమ భవిష్యత్తుకు సంబంధించిందని ప్రధాని నెతన్యాహు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని