South Korea: అణుదాడికి పాల్పడితే.. కిమ్ పాలన అంతమైనట్లే..!

కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. తాజాగా ఉత్తర కొరియా(North Korea) మరోసారి క్షిపణి ప్రయోగాలు నిర్వహించి ఈ ఉద్రిక్తతలను మరింత పెంచింది. 

Published : 22 Jul 2023 12:21 IST

సియోల్‌: ఉత్తర కొరియా(North Korea) దేశానికి.. దక్షిణ కొరియా(South Korea) తీవ్ర హెచ్చరికలు పంపింది. ఉత్తర కొరియా అణుదాడికి పాల్పడితే కిమ్ జోంగ్ ఉన్‌(Kim Jong Un) పాలన అంతమైనట్లేనని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు దక్షిణ కొరియా వార్తా సంస్థ కథనం పేర్కొంది. 

అణు క్షిపణులను ప్రయోగించే సామర్థ్యమున్న అమెరికా(USA) జలాంతర్గామిని ఇటీవల దక్షిణ కొరియా(South Korea) సమీపంలో నిలిపి ఉంచారు. 1980ల తర్వాత ఒక ఎస్‌ఎస్‌బీఎన్‌ ఆ ప్రాంతానికి రావడం ఇదే తొలిసారి. ఉత్తర కొరియా(North Korea) నుంచి ఇటీవల కాలంలో కవ్వింపు చర్యలు పెరగడంతో.. దక్షిణ కొరియా రక్షణకు కట్టుబడి ఉన్నామంటూ అమెరికా ఈ జలాంతర్గామిని కొరియా ద్వీపకల్పానికి తీసుకువచ్చింది. దీనిపై కిమ్ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఈ తీరు అణుదాడికి దారితీయొచ్చని వ్యాఖ్యానించింది. అదే జరిగితే.. కిమ్ పాలన అంతమవుతుందని దక్షిణ కొరియా హెచ్చరికలు పంపింది. ‘దక్షిణ కొరియా-అమెరికా కూటమిపై ఉత్తర కొరియా అణుదాడి చేస్తే.. మా కూటమి నుంచి తీవ్రస్థాయి ప్రతిస్పందన వస్తుంది. దాని ఫలితంగా ఉత్తర కొరియా ప్రభుత్వం అంతమవుతుంది’ అని వార్తా సంస్థ కథనం పేర్కొంది. 

స్కూల్‌కు సెలవు పెట్టకుండా 50 దేశాలను చుట్టేసిన పదేళ్ల చిన్నారి.. అదెలాగో తెలుసా..!

వెనక్కి తగ్గని ఉత్తర కొరియా.. 

అమెరికా జలాంతర్గామి రాకతో తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగాలను కొనసాగిస్తోంది. తాజాగా కొరియా ద్వీపకల్పానికి పశ్చిమాన ఉన్న సముద్రం వైపు శనివారం క్రూజ్‌ క్షిపణులను ప్రయోగించింది. ఈ ప్రయోగాలు శనివారం తెల్లవారుజామున జరిగినట్లు దక్షిణ కొరియా వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని