North Korea: కిమ్ రాజ్యంలో దారుణాలు.. గర్భిణులు, స్వలింగ సంపర్కులకు ఉరిశిక్షలు
ఉత్తర కొరియాలో ప్రజలు జీవించే హక్కు పెనుప్రమాదంలో ఉన్నట్లు తెలుస్తోంది. వీడియోలు చూశారని, డ్యాన్సులు చేశారన్న చిన్న చిన్న కారణాలకే అక్కడ ప్రజలకు మరణశిక్షలు విధిస్తున్నారు. గర్భిణులు, చిన్నారులు అని కూడా చూడట్లేదు. ఈ మేరకు దక్షిణకొరియా సంచలన నివేదిక విడుదల చేసింది.
ప్యాంగ్యాంగ్: ఉత్తరకొరియా(North Korea)లో చిన్నచిన్న నేరాలకే కఠినమైన శిక్షలు విధిస్తారనే విషయం అందరికీ తెలిసిందే. ఆ శిక్షలు ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి. తాజాగా దీనిపై పొరుగు దేశం దక్షిణ కొరియా (South Korea) సంచలన ఆరోపణలు చేసింది. కిమ్ ఆగడాలు మితిమీరుతున్నాయని ఆరోపించింది. చిన్నారులను, గర్భిణులను ఉరితీస్తూ ఆ దేశం మానవ హక్కులను ఉల్లంఘిస్తోందని ఆరోపించింది. ఈ మేరకు దక్షిణకొరియా యునిఫికేషన్ మినిస్ట్రీ (South Korea's Unification Ministry) గురువారం 450 పేజీల నివేదికను వెలువరిచింది. ఈ శాఖ కొరియా దేశాల మధ్య వ్యవహారాలను పర్యవేక్షిస్తుంది.
ఉత్తర కొరియా ప్రజల జీవించే హక్కు పెనుప్రమాదంలో ఉందని, చట్టంలో లేని, మరణశిక్షకు అనర్హమైన కేసులకు సైతం ఉరిశిక్షలు విధిస్తున్నారని ఆరోపించింది. మతపరమైన కార్యకలాపాలకు యత్నించడం, మూఢనమ్మకాలు, డ్రగ్స్ వినియోగించడం, దక్షిణకొరియాకు చెందిన వీడియోలను వీక్షించడం వంటి వాటిని తీవ్రమైన నేరాలుగా పరిగణిస్తూ మరణ దండన విధిస్తున్నారని పేర్కొంది. కిమ్ రాజ్యంలో కఠిన నిబంధనలను భరించలేక 2017 నుంచి 2022 మధ్య ఇతర దేశాలకు వలస వెళ్లిన 500 మంది ఉత్తర కొరియన్లను విచారించి దక్షిణ కొరియా ఈ నివేదిక తయారుచేసింది.
దివంగత కిమ్ ఇల్ సంగ్ చిత్రపటాన్ని చూపిస్తూ ఓ మహిళ నృత్యం చేసిన వీడియో వైరల్ అయింది. దీన్ని నేరంగా పరిగణిస్తూ ఆరు నెలల గర్భిణీగా ఉన్న ఆ మహిళను బహిరంగంగా ఉరితీసిందని ఆ నివేదిక ఆరోపించింది. దేశంలోని మరుగుజ్జుల జాబితాను తయారు చేయమని నర్సులపై పాలనా యంత్రాంగం ఒత్తిడి చేసిందని, ఓ మరుగుజ్టు మహిళ గర్భాశయాన్ని తొలగించడానికి శస్త్రచికిత్స చేయించిందని వెల్లడించింది. కాంగ్వాన్ ప్రావిన్స్, వాన్సన్ నగరంలోని ఓ స్టేడియంలో ఆరుగురు యువకులు ధూమపానం చేస్తూ దక్షిణకొరియాకు సంబంధించిన వీడియోను చూస్తున్నారని వారిపై నిర్ధాక్షిణ్యంగా కాల్పులు జరిపారని వివరించింది. స్వలింగ సంపర్కులు, కొన్ని మతాల వారు, విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నించిన వారికీ ఉరిశిక్షలు విధిస్తున్నట్లు పేర్కొంది. వ్యక్తులకు రహస్యంగా నిద్రమాత్రలిచ్చి వారిని బలవంతంగా ఆసుపత్రుల్లో చేర్చి వారిపై వివిధ రకాల ప్రయోగాలు చేస్తున్నారని ఆరోపణలు చేసింది. సామాజిక మంత్రిత్వ శాఖలోని కొందరు అధికారులు ప్రజలను బెదిరించి, వారిని బ్లాక్‌మెయిల్ చేసి.. వారిపై వివిధ వైద్య ప్రయోగాలు చేస్తున్నారని తెలిపింది. వికలాంగులు ముఖ్యంగా మరుగుజ్జులు వారి మానవ హక్కులను కోల్పోయారని, వారి ఇష్టానికి విరుద్ధంగా వారిపై వైద్య ప్రయోగాలు నిర్వహించారని దక్షిణకొరియా నివేదిక వెల్లడించింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
నా భర్త కళ్లలో చెదరని నిశ్చలత చూశా
-
India News
ప్రపంచంలో ఎక్కడినుంచైనా శబరి గిరీశునికి కానుకలు
-
India News
ప్రతి 5 విద్యార్థి వీసాల్లో ఒకటి భారతీయులకే.. అమెరికా రాయబారి వెల్లడి
-
World News
Space: ఇకపై అంతరిక్షంలో వ్యోమగాములు ఫ్రెంచ్ ఫ్రైస్ తినొచ్చు!
-
India News
Odisha Train Accident: ఏఐ సాంకేతికతతో మృతదేహాల గుర్తింపు!
-
Movies News
Social Look: ఐస్‌క్రీమ్‌తో రకుల్‌ప్రీత్.. చెప్పుతో తేజస్విని.. తమన్నా ప్రచారం!