North Korea: కిమ్‌కు ఎదురుదెబ్బ..! నిఘా ఉపగ్రహ ప్రయోగం విఫలం

కిమ్‌ జోంగ్‌ ఉన్‌ సర్కారుకు ఎదురుదెబ్బ తగిలింది. మరో నిఘా ఉపగ్రహాన్ని (Spy Satellite) భూకక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు చేసిన ప్రయోగం విఫలమైంది.

Published : 27 May 2024 22:26 IST

సియోల్‌: మరో నిఘా ఉపగ్రహాన్ని (Spy Satellite) భూకక్ష్యలో ప్రవేశపెట్టేందుకు ఉత్తర కొరియా (North Korea) చేసిన ప్రయోగం విఫలమైంది. నిఘా ఉపగ్రహాన్ని నింగిలోకి మోసుకెళ్లిన రాకెట్‌ మార్గమధ్యలోనే పేలిపోయినట్లు ఆ దేశ అధికార మీడియా వెల్లడించింది. రాకెట్‌ ఇంజిన్‌ వైఫల్యం కారణంగానే ఈ ఘటన జరిగి ఉండొచ్చని పేర్కొంది. అంతకుముందు క్షిపణి లాంటిదాన్ని ఆ దేశం ప్రయోగించినట్లు జపాన్‌, దక్షిణ కొరియాలు వెల్లడించాయి. ఇదిలా ఉండగా.. గతేడాది నవంబరులో కిమ్‌ ప్రభుత్వం తొలిసారి ఓ నిఘా ఉపగ్రహాన్ని భూకక్ష్యలోకి ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఆ సమయంలోనూ రెండు విఫలయత్నాలు చేసింది.

అగ్నికి ఆజ్యం.. తైవాన్‌కు చేరుకొన్న అమెరికా కాంగ్రెస్‌ బృందం

తరచూ బాలిస్టిక్‌ క్షిపణులను ప్రయోగిస్తూ అమెరికా తదితర శత్రు దేశాలను హెచ్చరించే ఉత్తర కొరియా.. తమ దేశ రక్షణ చర్యలను మరింత పటిష్ఠం చేసుకునే పనిలో పడింది. ఈ క్రమంలోనే అమెరికా, దక్షిణ కొరియా సైనిక కార్యకలాపాలను మెరుగ్గా పర్యవేక్షించేందుకు, అణ్వాయుధ సామర్థ్యం కలిగిన తమ క్షిపణులతో ముప్పును మరింత పెంచేందుకు అంతరిక్ష ఆధారిత నిఘా నెట్‌వర్క్‌ను నిర్మించేందుకు యత్నిస్తోంది. 2024లో మూడు అదనపు నిఘా ఉపగ్రహాలను ప్రయోగిస్తామని దేశాధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ఇప్పటికే చెప్పారు. వాస్తవానికి.. ఉపగ్రహ ప్రయోగాల విషయంలో ఉత్తర కొరియాపై ఐరాస నిషేధం విధించింది. అయితే.. ఉపగ్రహాలను ప్రయోగించే, క్షిపణులను పరీక్షించే హక్కు తమకు ఉందని కిమ్‌ ప్రభుత్వం చెబుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని