Kim Jong Un: ఇది ప్రతి ఇంటి సమస్య.. జనన రేటు క్షీణతపై కిమ్‌ ఆందోళన

తమ దేశంలో నానాటికీ జనన రేటు క్షీణించడంపై ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

Published : 05 Dec 2023 02:10 IST

ప్యాంగాంగ్‌: తమ దేశంలో జనాభా తగ్గుదలపై ఉత్తర కొరియా (North Korea) అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ (Kim Jong Un)ఆందోళన వ్యక్తం చేశారు. జనన రేటు పెంచాలని దేశ ప్రజలకు కిమ్‌ పిలుపునిచ్చారు. ఈ మేరకు ప్యాంగాంగ్‌లో తల్లుల కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

జాతీయ శక్తిని మరింత బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్న తల్లులకు కిమ్‌ జోంగ్‌ కృతజ్ఞతలు తెలిపారు. కొన్నేళ్లుగా జనాభా రేటు క్షీణిస్తుండడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ప్రతి ఒక్కరి ఇంటి సమస్య అని కిమ్‌ పేర్కొన్నారు. జనన క్షీణతను నిలువరించడం ఇప్పుడు ఎంతో ముఖ్యమన్నారు. శిశు జనన రేటు తగ్గుదలను అడ్డుకుని జననాల సంఖ్యను పెంచాల్సిన అవసరముందని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన తల్లులకు పిల్లల పెంపకంపై పలు సూచనలు చేశారు. పిల్లలను సరైన రీతిలో పెంచాలని.. వారి సంరక్షణ తల్లుల బాధ్యత అని పేర్కొన్నారు.

200 హమాస్‌ స్థావరాలపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్‌ సైన్యం

యూఎన్‌ పాపులేషన్‌ ఫండ్‌ అంచనా ప్రకారం.. ఈ ఏడాదిలో ఉత్తర కొరియాలో సగటు జనన రేటు 1.8 ఉండగా.. మరోవైపు దక్షిణ కొరియాలో కూడా ఫెర్టిలిటీ రేటు దారుణంగా పడిపోయింది. అక్కడ ఈ రేటు 0.78గా ఉంది. దీంతో ఈ పరిస్థితిని నిలువరించేందుకు ప్రత్యేక కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఇక జపాన్‌లో 1.26గా ఉంది. ఇదిలా ఉండగా.. 25 మిలియన్ల జనాభా ఉన్న ఉత్తర కొరియాలో కొన్నేళ్ల క్రితం ప్రకృతి వైపరీత్యాల కారణంగా తీవ్ర కరవు సంభవించింది. ఇది ఆహార సంక్షోభానికి దారితీసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని