Pakistan: జీతం తీసుకోనన్న జర్దారీ.. పాక్‌ కోసం అధ్యక్షుడి ‘‘త్యాగం’’..!

పాక్‌ను ఆర్థిక కష్టాల నుంచి బయటేయడానికి ఆ దేశ పాలకులు నానా అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ సొమ్ము తీసుకోవడం తగదంటూ అధ్యక్షుడు జర్దారీ జీతాన్ని వదులుకొన్నారు. 

Updated : 13 Mar 2024 14:06 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: పాకిస్థాన్‌ (Pakistan) నూతన అధ్యక్షుడు ఆసీఫ్‌ అలీ జర్దారీ ఓ త్యాగం చేశారు. దేశం ఆర్థిక కష్టాల్లో ఉండటంతో ఆయన జీతం తీసుకోవడానికి నిరాకరించారట. వివేకవంతమైన ఆర్థిక నిర్వహణను ప్రోత్సహించేందుకే ఈ నిర్ణయం తీసుకొన్నారట. ఈ విషయాన్ని అధ్యక్ష కార్యాలయం ఎక్స్‌ వేదికగా ప్రకటించింది.

‘‘దేశంలో ఆర్థిక నిర్వహణను మరింత సమర్థవంతంగా మార్చాలన్నదే అధ్యక్షుడి నిర్ణయం వెనుక ఉద్దేశం. దేశ ఖజానాపై తన జీతం భారం కాకూడదని అధ్యక్షుడు నిర్ణయించుకొన్నారు. అందుకే ఆయన జీతం తీసుకోకూడదని అనుకొన్నారు’’ అని ట్విటర్‌లో పేర్కొంది. ఇటీవలే జర్దారీ రెండో సారి దేశాధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. 

మరోవైపు పాక్‌ ఇంటీరియర్‌ మంత్రి మొహసిన్‌ నక్వీ కూడా ఈ సారి పదవీకాలంలో జీతాన్ని వదులుకోవాలని నిర్ణయించుకొన్నారు. ‘‘ఇది సవాళ్లతో కూడిన సమయం. వీలైనన్ని మార్గాల్లో దేశానికి అండగా ఉండి సేవ చేయాలని నిర్ణయించుకొన్నాను’’ అని పేర్కొన్నారు.

హిందూ మహా సముద్రంలో నౌక హైజాక్‌..

గత కొన్నేళ్లుగా పాక్‌ ఆర్థికంగా కుప్పకూలిపోతోంది. ద్రవ్యోల్బణం అదుపుతప్పింది. గత నెల ఐఎంఎఫ్‌ నుంచి 6 బిలియన్‌ డాలర్ల విలువైన అప్పు తీసుకొనేందుకు సన్నాహాలు చేసుకొంటున్నట్లు వార్తలొచ్చాయి. ముఖ్యంగా ఆ దేశ చెల్లించాల్సిన బకాయిలు కొండలా పేరుకుపోయాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని