Singapore Airlines: విమానంలో భారీ కుదుపులు.. ఒకరి మృతి

ఓ విమానం భారీగా కుదుపులకు లోనైన ఘటనలో ఒకరు మృతి చెందాడు.

Updated : 21 May 2024 16:53 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: గగనతలంలో విమాన ప్రయాణికులకు భయానక అనుభవం ఎదురైంది. ఓ విమానం భారీ కుదుపులకు లోనైన ఘటనలో ఒకరు మృతి చెందారు. మరో 30 మంది ప్రయాణికులకు గాయాలైనట్లు సమాచారం.

సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ (Singapore Airlines)కు చెందిన ఓ విమానం (SQ321) మే 20న మొత్తం 211 మంది ప్రయాణికులు, 18 మంది సిబ్బందితో బ్రిటన్‌ రాజధాని లండన్‌ నుంచి సింగపూర్‌కు బయల్దేరింది. మార్గమధ్యలో ఫ్లైట్‌ తీవ్ర కుదుపులకు లోనుకావడంతో దాన్ని థాయ్‌లాండ్‌ రాజధాని బ్యాంకాక్‌లోని సువర్ణభూమి విమానాశ్రయానికి మళ్లించారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారని సంస్థ వెల్లడించింది. మరో 30 మందికి గాయాలైనట్లు సమాచారం.

యూరప్‌ ట్రిప్‌ మరింత భారం.. షెంజెన్‌ వీసా ఫీజు పెంపు

బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ ప్రకటించింది. ప్రయాణికులకు అవసరమైన వైద్య సాయం అందించేందుకు థాయ్‌లాండ్‌ అధికారులతో కలిసి పనిచేస్తున్నట్లు వెల్లడించింది. పరిస్థితిని పర్యవేక్షించేందుకు ఓ బృందాన్ని బ్యాంకాక్‌కు పంపుతున్నట్లు తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని