Biden: ‘నేను మరీ యవ్వనంగా కనిపిస్తున్నానట..!’ వైద్యపరీక్షల అనంతరం బైడెన్ చమత్కారం

అమెరికా అధ్యక్షుడు బైడెన్(Biden) జ్ఞాపకశక్తిలో లోపాలను ఎత్తిచూపుతూ ఓ నివేదిక బయటకు వచ్చిన తరుణంలో.. ఆయన ఫిట్‌గా ఉన్నారంటూ వైద్యులు సర్టిఫికెట్ ఇచ్చారు. 

Updated : 29 Feb 2024 12:08 IST

వాషింగ్టన్‌: వయసురీత్యా వచ్చే ఆరోగ్య సమస్యలు అమెరికా అధ్యక్షుడు బైడెన్‌(Biden)కు ఆటంకంగా మారాయి. అధ్యక్ష ఎన్నికల వేళ..  తన ప్రత్యర్థి రిపబ్లికన్ పార్టీకి ప్రచారాస్త్రాలుగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన ఏడాదికొకసారి నిర్వహించే వైద్యపరీక్షలు చేయించుకున్నారు. తాను మరీ యవ్వనంగా కనిపిస్తున్నానని వైద్యులు ఆశ్చర్యపోయారంటూ ఈ సందర్భంగా చమత్కరించారు.  వైద్యులు కూడా ఆయన ఫిట్‌గా ఉన్నట్లు వెల్లడించారు.

‘ప్రెసిడెంట్ బైడెన్‌ ఆరోగ్యంగా, చురుగ్గా ఉన్నారు. అధ్యక్ష బాధ్యతలు విజయవంతంగా నిర్వహించడానికి కావాల్సిన దృఢత్వాన్ని కలిగిఉన్నారు. కొత్తగా ఎలాంటి సమస్యలు బయటపడలేదు’ అని పేర్కొన్నారు. పరీక్షల అనంతరం వైట్‌హౌస్‌కు చేరుకున్న బైడెన్ మీడియాతో మాట్లాడారు. ‘గత ఏడాది మాదిరిగానే ఎలాంటి తేడా లేదు. నేను మరీ యవ్వనంగా కనిపిస్తున్నానని వారు అనుకుంటున్నారు’ అని సరదాగా వ్యాఖ్యలు చేశారు.

బైడెన్‌కు ఆ విషయాలూ గుర్తులేవు.. కీలక నివేదికలో సంచలన ఆరోపణలు!

వయసురీత్యా వచ్చే ఇబ్బందుల వల్ల అమెరికా అధ్యక్షుడు బైడెన్ (Biden) జ్ఞాపకశక్తిలో అనేక లోపాలను గుర్తించినట్లు ఓ కీలక నివేదిక ఇటీవల వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. 81 ఏళ్ల వయసున్న బైడెన్‌కు జ్ఞాపకశక్తి చాలా ‘మసక’గా ఉందని పేర్కొంది. జీవితంలోని కీలక సంఘటనలను సైతం ఆయన గుర్తుకు తెచ్చుకోలేకపోయారని తెలిపింది. కుమారుడు బ్యూ బైడెన్‌ ఎప్పుడు చనిపోయారనే విషయమూ జ్ఞప్తికి లేదని పేర్కొంది. ఉపాధ్యక్షుడిగా పనిచేసిన కాలం కూడా గుర్తులేదని తెలిపింది. ఈ నివేదికను బైడెన్‌ తీవ్రంగా ఖండించారు. దీనికిముందు కూడా ఆయన జ్ఞాపకశక్తిని లైవ్‌లో చూసి అమెరికన్లు అవాక్కయిన సందర్భాలున్నాయి. ఇవన్నీ అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తోన్న వేళ.. డెమోక్రాటిక్ పార్టీకి ఇబ్బందిగా మారాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు