Russia: 20 డ్రోన్లను కూల్చేశాం: ఉక్రెయిన్‌ దాడుల్ని అడ్డుకున్నామన్న రష్యా

ఉక్రెయిన్‌-రష్యా యుద్ధంలో ఇటీవల డ్రోన్ల దాడులు తీవ్రం అయ్యాయి. వరుసగా మూడురోజులు రష్యా(Russia)పై ఉక్రెయిన్ డ్రోన్లతో విరుచుకుపడింది. 

Published : 12 Aug 2023 18:23 IST

మాస్కో: ఇటీవల కాలంలో రష్యా(Russia)పై వరుసగా డ్రోన్‌(Drone) దాడులు జరుగుతున్నాయి. ఉక్రెయిన్(Ukraine) వైపు నుంచి వస్తోన్న ఈ దాడిని పుతిన్‌(Putin) సేనలు సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాయి. తాజాగా 20 డ్రోన్లను అడ్డుకున్నట్లు శనివారం రక్షణ శాఖ వెల్లడించింది. 

14 డ్రోన్లను కూల్చివేసినట్లు, మరో ఆరింటిని జామ్ చేసినట్లు తెలిపింది. రష్యా ఆక్రమిత క్రిమియాలో రాత్రి జరిగిన దాడుల వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని తెలిపింది. గత ఏడాది ప్రారంభం నుంచి ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలో మాస్కో, క్రిమియాపై ఉక్రెయిన్‌ డ్రోన్లతో విరుచుకుపడుతోంది. గత మూడురోజులుగా వరుసగా ఈ తరహా దాడులు చేసింది. అయితే ఈ ఘటనల వెనక తమ హస్తం ఉందని ఉక్రెయిన్‌ అంగీకరించలేదు. అలాగనీ నిరాకరించనూ లేదు. 

ఎటు చూసినా కాలిన శవాలే.. బూడిదైన హవాయి స్వర్గధామం

నిన్న కూడా మాస్కోలో డ్రోన్ల కదలికలను గుర్తించడంతో రెండు విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసివేశారు.  అనంతరం కొద్దిసేపటికి రష్యా రక్షణ శాఖ ఓ డ్రోన్‌ను కూల్చివేసినట్లు ప్రకటించింది. ‘విమానాశ్రయంపై దాడి చేయడానికి కీవ్‌ చేసిన యత్నాన్ని భగ్నం చేశాం’ అని రక్షణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే శనివారం ఉదయం రష్యా జరిపిన దాడుల్లో ఉక్రెయిన్‌కు  చెందిన ఖర్కీవ్‌ ప్రాంతంలో ఓ వృద్ధురాలు మృతిచెందింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు