Russia - Ukraine war: ఉక్రెయిన్‌ ప్రయోగించిన 20 క్షిపణులను కూల్చాం: రష్యా

ఉక్రెయిన్‌ తమపై ప్రయోగించిన 20 క్షిపణులను ధ్వంసం చేసినట్లు రష్యా రక్షణ మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. 

Published : 01 Feb 2024 02:36 IST

కీవ్‌: ఉక్రెయిన్‌ ప్రయోగించిన క్షిపణులను కూల్చివేసినట్లు రష్యా (Russia) ప్రకటించింది. నల్ల సముద్రం, క్రిమియా ద్వీపకల్పం మీదుగా 20 క్షిపణులను ఉక్రెయిన్‌ (Ukraine) ప్రయోగించినట్లు పేర్కొంది. తమ గగనతల రక్షణ వ్యవస్థ వాటిని కూల్చివేసినట్లు తెలిపింది. ఈ మేరకు రష్యా రక్షణ మంత్రిత్వశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. కూలిన క్షిపణి శిథిలాలు సెవాస్టోపోల్ నగర సమీపంలోని లియుబిమోవ్కా ప్రాంతంలో పడ్డాయని వెల్లడించింది. ఈ ఘటనలో పౌరులకు ఎలాంటి గాయాలు కాలేదని పేర్కొంది.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు