Miss Universe: మిస్‌ యూనివర్స్‌ పోటీల్లో సౌదీ అరేబియా.. తొలిసారి ప్రాతినిధ్యం!

ఫ్యాషన్‌ రంగంలో ఎంతో ప్రతిష్ఠాత్మంగా భావించే మిస్‌ యూనివర్స్‌ (Miss Universe 2024) పోటీల్లో సౌదీ అరేబియా తొలిసారి పాల్గొననుంది.

Published : 27 Mar 2024 00:16 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఫ్యాషన్‌ రంగంలో ఎంతో ప్రతిష్ఠాత్మంగా భావించే మిస్‌ యూనివర్స్‌ (Miss Universe 2024) పోటీలకు సౌదీ అరేబియా సిద్ధమైంది. రూమీ అల్కహ్తాని అనే 27ఏళ్ల అందాల భామ ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా రూమీ వెల్లడించారు. అంతర్జాతీయ వేదికగా జరిగే ఓ అందాల పోటీల్లో పాల్గొనే తొలి సౌదీ (Saudi Arabia) యువతిగా నిలవనుంది.

73వ మిస్‌ యూనివర్స్‌ పోటీలు సెప్టెంబర్‌ 28, 2024న మెక్సికోలో నిర్వహించనున్నారు. ఇందులో సౌదీ అరేబియా తొలిసారి భాగస్వామ్యం కానుంది. రియాద్‌కు చెందిన రూమీ అల్కహ్తాని ఈ పోటీల్లో అధికారికంగా పాల్గొననున్నారు. ఇటీవల మలేసియాలో నిర్వహించిన మిస్‌ అండ్‌ మిసెస్‌ గ్లోబల్‌ ఏసియన్‌ ఈవెంట్‌లో పాల్గొన్న ఆమె.. ప్రపంచ సంస్కృతుల గురించి తెలుసుకోవడంతోపాటు సౌదీ సంప్రదాయ, వారసత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పడమే తన ప్రయత్నమని అన్నారు.

జీపీఎస్‌ జామింగ్‌.. యూరప్‌లో వందల విమానాలపై ఎఫెక్ట్‌!

ప్రాంతీయంగా నిర్వహించిన పలు అందాల పోటీల్లో రూమీ పాల్గొన్నారు. మిస్‌ సౌదీ అరేబియా కిరీటాన్ని దక్కించుకున్నారు. మిస్‌ మిడిల్‌ ఈస్ట్‌ (సౌదీ అరేబియా), మిస్‌ అరబ్‌ వరల్డ్‌ పీస్‌ 2021, మిస్‌ వుమెన్‌ (సౌదీ అరేబియా) వంటి టైటిళ్లను సొంతం చేసుకున్నారు. ఇన్‌స్టాలో 10లక్షలకుపైగా ఫాలోవర్లు కలిగిన రూమీ.. మిస్‌ యూనివర్స్‌ 2024 పోటీల్లో సౌదీ తరఫున ప్రాతినిధ్యం వహించనుండటం ఎంతో సంతోషంగా ఉందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని