ఉక్రెయిన్‌లో విద్యార్థులకు తుపాకీ కాల్చడంలో శిక్షణ!

ఉక్రెయిన్‌లో విద్యార్థులకు తుపాకీ కాల్చడంలో శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రాంతీయ అధికారులు తెలిపారు.

Published : 19 Jan 2024 02:09 IST

కీవ్‌: రష్యా (Russia)తో ఏడాదిగా యుద్ధం చేస్తున్న ఉక్రెయిన్‌ (Ukraine) కీలక నిర్ణయం తీసుకుంది. తమ దేశంలోని విద్యార్థులకు తుపాకీ కాల్చడంలో శిక్షణ ఇవ్వనుంది. యుద్ధం ప్రభావంతో ఉక్రెయిన్‌లో పాఠశాల విద్య తీవ్రంగా ప్రభావితమైంది. ఈ క్రమంలో యుద్ధ సంబంధిత విషయాలను పాఠ్యాంశాలుగా చేర్చారు. తాజాగా విద్యార్థులకు రక్షణ మంత్రిత్వ శాఖ రూపొందించిన ఇంటరాక్టివ్‌ సాంకేతికత సాయంతో రైఫిల్‌, పిస్టోల్‌ కాల్చడంలో శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రాంతీయ అధికారి తెలిపారు. 

‘‘పశ్చిమ ఇవానో-ఫ్రాంక్విస్క్‌ సహా ఇతర ప్రాంతాల్లోని పాఠశాల విద్యార్థులకు 23 నెలలపాటు శిక్షణ ఇస్తాం. తర్వాత తూర్పు ప్రాంతంలో ప్రారంభిస్తాం. సైనిక, దేశ భక్తి విద్యకు సంబంధించి నైపుణ్యాన్ని పెంపొందించడంలో భాగంగా మొబైల్‌, మల్టీమీడియా సాంకేతికతతో ఈ శిక్షణ ఉంటుంది’’ అని ఇవానో గవర్నర్‌ స్విత్లానా తెలిపారు. రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్‌లో 3,500 విద్యా సంస్థల్లో సౌకర్యాలు దెబ్బతినగా, 365 చోట్ల పూర్తిగా నాశనమయ్యాయని కీవ్‌ వెల్లడించింది. ఈ క్రమంలో విద్యార్థులకు ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహిస్తోంది. 

జర్మనీ గుండెల్లో ‘మూడో ప్రపంచ యుద్ధ’ భయం!

కొద్ది రోజుల క్రితం రష్యాకు చెందిన రెండు కమాండ్‌ విమానాలను ఉక్రెయిన్‌ కూల్చివేసింది. ఆర్థికంగా ఇది మాస్కోకు పెద్ద దెబ్బని కీవ్‌ వ్యాఖ్యానించింది. ఈ క్రమంలో ఉక్రెయిన్‌పై రష్యా దాడులు మరింత తీవ్రతరం చేస్తుందని, ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీయొచ్చనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని