Harry Winston: మారణాయుధాలతో హ్యారీ విన్‌స్టన్‌లోకి చొరబడి.. రూ.కోట్ల విలువైన ఆభరణాలు చోరీ

పారిస్‌లోని ఓ లగ్జరీ ఉత్పత్తుల కంపెనీలో భారీ చోరీ జరిగింది. మారణాయుధాలతో వచ్చిన దుండగులు రూ. కోట్ల విలువైన ఆభరణాలు, వస్తువులను ఎత్తుకెళ్లారు.

Updated : 20 May 2024 15:36 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: లగ్జరీ ఉత్పత్తుల కంపెనీ ‘హ్యారీ విన్‌స్టన్’ (Harry Winston)లో భారీ చోరీ జరిగింది. మారణాయుధాలతో కంపెనీ లోపలికి ప్రవేశించిన కొందరు దుండగులు రూ. కోట్ల విలువైన వస్తువులను దోచుకెళ్లారు. ఈ విషయాన్ని ఫ్రాన్స్‌ దర్యాప్తు కార్యాలయం వెల్లడించింది. అసలేం జరిగిందంటే..

పారిస్‌లోని హ్యారీ విన్‌స్టన్‌ కంపెనీ లగ్జరీ ఉత్పత్తులకు నిలయం. ఇది ‘జ్యువెలర్స్‌ టు ది స్టార్స్‌’గా పేరుగాంచింది. ప్రముఖులు, సెలబ్రిటీలు ఇక్కడ ఆభరణాలు కొనుగోలు చేస్తుంటారు. ఈ లగ్జరీ ప్యారిస్‌ బోటిక్‌లోకి ముగ్గురు దుండగులు మారణాయుధాలతో ప్రవేశించారు. ఇద్దరు దోచుకుంటుంటే మరొకరు కాపలా ఉన్నారు. చేతికి అందినంతా దోచుకుని ద్విచక్ర వాహనాలపై పరారయ్యారు.

బెల్‌-212.. ఇరాన్‌ అధ్యక్షుడు ప్రయాణించిన ‘వర్క్‌హార్స్‌’!

దుండగుల వద్ద ఆయుధాలు ఉండడంతో వారిని అక్కడున్న పోలీసులు అడ్డుకోలేకపోయారు. మొత్తం మిలియన్ల యూరోలు విలువ చేసే వస్తువులు, ఆభరణాలను ఎత్తుకెళ్లారు. సినీ ఫక్కీలో జరిగిన ఈ దోపిడీపై స్థానిక పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ లగ్జరీ స్టోర్‌లో చోరీ జరగడం ఇది తొలిసారి కాదు. గతంలోనూ సుమారు 92 మిలియన్ల డాలర్ల విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారు. ఎనిమిది మంది ఈ కేసులో దోషులుగా తేలారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు