Shehbaz Sharif: పాకిస్థాన్‌ ప్రధానిగా షెహబాజ్‌ షరీఫ్‌.. వరుసగా రెండోసారి

పాకిస్థాన్‌ నూతన ప్రధాన మంత్రిగా షెహబాజ్‌ షరీఫ్‌ వరుసగా రెండోసారి ఎన్నికయ్యారు.

Updated : 03 Mar 2024 15:01 IST

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ (Pakistan) ప్రధాన మంత్రిగా షెహబాజ్‌ షరీఫ్‌ (Shehbaz Sharif) వరుసగా రెండోసారి ఎన్నికయ్యారు. పీఎంఎల్‌-ఎన్‌, పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ (PPP)ల తరఫున అభ్యర్థిగా ఉన్న షెహబాజ్‌.. జాతీయ అసెంబ్లీలో ఆదివారం నిర్వహించిన ఓటింగ్‌లో మొత్తం 336 ఓట్లకుగానూ 201 ఓట్లు సాధించారు. పాకిస్థాన్‌ తెహ్రీక్‌ ఏ ఇన్సాఫ్‌ (PTI) పార్టీ అభ్యర్థి ఒమర్‌ అయూబ్‌ఖాన్‌కు 92 ఓట్లు మాత్రమే వచ్చాయి.

పాక్‌లో మరో ఉగ్రవాది మిస్టరీ మరణం..!

ఓటింగ్‌ సందర్భంగా పీటీఐ మద్దతుగల చట్టసభ్యుల నినాదాలతో పార్లమెంటులో గందరగోళం నెలకొంది. షెహబాజ్ సోమవారం అధ్యక్ష భవనంలో దేశ 33వ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 2022 ఏప్రిల్‌లో ఇమ్రాన్‌ఖాన్‌ పదవీచ్యుతుడైన అనంతరం మొదటిసారి ప్రధాని బాధ్యతలు చేపట్టిన షరీఫ్‌.. గతేడాది ఆగస్టు వరకు సంకీర్ణ సర్కారుకు సారథ్యం వహించిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 8న సార్వత్రిక ఎన్నికలు నిర్వహించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని