Pak terrorist: పాక్‌లో మరో ఉగ్రవాది మిస్టరీ మరణం..!

భారత మోస్ట్‌ వాంటెడ్‌ జాబితాలోని ఉగ్రవాది పాక్‌లో అనుమానాస్పదస్థితిలో హత్యకు గురయ్యాడు. యునైటెడ్‌ జిహాద్‌ కౌన్సిల్‌ కార్యదర్శి  అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. 

Published : 03 Mar 2024 12:40 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: పాక్‌ (Pakistan)కు చెందిన మోస్ట్‌వాంటెడ్‌ ఉగ్రవాదుల్లో ఒకడైన షేక్‌ జమీల్‌ ఉర్‌ రహ్మాన్‌ ఖైబర్‌ ప్రావిన్స్‌లోని అబొటాబాద్‌ సమీపంలో అనుమానాస్పద స్థితిలో మరణించాడు. యునైటెడ్‌ జిహాద్‌ కౌన్సిల్‌కు అతడు స్వయం ప్రకటిత ప్రధాన కార్యదర్శి. పాక్‌లోని ఉగ్ర గ్రూప్‌లను ఇది సమన్వయం చేసుకొని కశ్మీర్‌లో దాడులు నిర్వహిస్తుంది. 1990ల్లో ప్రారంభించిన తెహ్రీక్‌ ఉల్‌ ముజాహిద్దీన్‌ అనే సంస్థకూ చీఫ్‌గా వ్యవహరిస్తున్నాడు. 2019లో దీనిపై కేంద్రం నిషేధం విధించింది. హిజ్బుల్‌, లష్కరే సంస్థలకు ఇది సహకరిస్తోందని ప్రభుత్వం తెలిపింది. 

2022లో భారత హోంశాఖ రహ్మాన్‌ను ఉగ్రవాదిగా ప్రకటించింది. ఇతడి స్వస్థలం కశ్మీర్‌లోని పుల్వామా. ఇక్కడ జరిగిన పలు దాడులకు ఇతడు ప్రధాన సూత్రధారి. కొన్నేళ్ల క్రితం సరిహద్దులు దాటి పాక్‌కు పారిపోయాడు. ఆ దేశ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ ఐఎస్‌ఐ ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తున్నాడు. తాజాగా ఇతడి మరణంతో కశ్మీర్‌లోని ఉగ్రకార్యకలాపాలు మందగిస్తాయని భద్రతా రంగ నిపుణులు అంచనావేస్తున్నారు.  

ముంబయి పేలుళ్ల సూత్రధారి, లష్కరే సీనియర్‌ కమాండర్‌ అజామ్‌ చీమా మృతి చెందిన విషయం తెలిసిందే. మల్కాన్‌వాలాలో అజామ్‌కు అంత్యక్రియలు నిర్వహించినట్లు నిఘా వర్గాలు తెలిపాయి. 26/11 పేలుళ్లతోపాటు.. 2006లో ముంబయి రైలు పేలుళ్ల వెనుకా అతని హస్తం ఉంది. ఈ ఘటనలో 188 మంది ప్రాణాలు కోల్పోయారు. 800 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. 2008 ముంబయి తాజ్‌హోటల్‌లో దాడులకు పాల్పడిన ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చాడనే కారణంగా అమెరికా అతడిని మోస్ట్‌ వాంటెడ్‌ టెర్రరిస్ట్‌ జాబితాలో చేర్చింది.

మా అనుమతి లేకుండా ఇంటర్వ్యూ చేస్తారా.. భారత మీడియాపై చైనా రుసరుస

2023 డిసెంబర్‌లో లష్కరే కమాండర్‌ అద్నాన్‌ అహ్మద్‌ అకా అబూ హంజాను కరాచీలో కాల్చి చంపారు. నవంబర్‌లో అదే గ్రూప్‌నకు చెందిన అక్రమ్‌ ఘాజీని ఖైబర్‌ ప్రావిన్స్‌లో హత్య చేశారు. సంజ్వాన్‌ దాడి సూత్రధారి ఖ్వాజా షహీద్‌ ఇదే విధంగా ప్రాణాలు కోల్పోయాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు