MV Rubymar: హూతీల దాడులు.. నీట మునిగిన తొలి వాణిజ్య నౌక

హూతీ తిరుగుబాటుదారుల దాడికి గురైన ఓ నౌక ఎర్ర సముద్రంలో మునిగిపోయింది.

Published : 02 Mar 2024 18:44 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వాణిజ్య నౌకలే లక్ష్యంగా యెమెన్‌కు చెందిన హూతీ తిరుగుబాటుదారులు (Houthi Rebels) దాడులకు తెగబడుతోన్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 18న బాబ్‌-అల్‌-మండెబ్‌ జలసంధి వద్ద దాడికి గురైన ఓ వాణిజ్య నౌక (MV Rubymar) తాజాగా ఎర్ర సముద్రం (Red Sea)లో మునిగిపోయింది. ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన ఈ జలమార్గంలో నెలలతరబడి సాగుతోన్న దాడుల్లో మునిగిపోయిన మొదటి ఓడ ఇదే. యెమెన్ ప్రభుత్వం, ప్రాంతీయ సైనిక అధికారి ఈవిషయాన్ని ధ్రువీకరించారు.

ఎర్రసముద్రంలో అలజడి

బలీజ్‌ దేశపు జెండాతో వెళ్తున్న ‘ఎంవీ రూబీమర్‌’పై దాడి జరిగిన 12 రోజులకు సిబ్బంది వదిలిపెట్టేశారు. దాన్ని ఓడరేవుకు తరలించేందుకు ప్రణాళికలూ రూపొందించారు. అయితే..  నౌక క్రమంగా ఉత్తరం వైపు కొట్టుకుపోయి నీట మునిగింది. ఇదిలాఉండగా.. ఎర్ర సముద్రంలో హూతీలు దాడులను ఆపకపోవడంతో అగ్రరాజ్య సంకీర్ణ సేనలు ఇటీవల నాలుగోవిడత వైమానిక దాడులను చేపట్టాయి. అమెరికా, బ్రిటన్‌ యుద్ధ విమానాలు మొత్తం ఎనిమిది ప్రదేశాల్లోని 18 లక్ష్యాలను ధ్వంసం చేశాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని