China: నౌక ఢీకొని భారీ వంతెన రెండు ముక్కలు..!

చైనా (China) లో ఓ వంతెనను భారీ నౌక ఢీకొంది.. దీంతో ఒక బస్సు సహా ఐదు వాహనాలు నదిలో పడిపోయాయి. అత్యవసర సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. బాధితుల సంఖ్య పూర్తిగా తెలియరాలేదు.

Updated : 22 Feb 2024 17:04 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: చైనాలో వంతెనను భారీ రవాణా నౌక ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు చనిపోగా.. మరో ముగ్గురు గల్లంతయ్యారు. గ్వాంగ్జూ నగరంలోని పెరల్‌ నదిపై ఈ ప్రమాదం చోటు చేసుకొంది. నేటి తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో ఈ నౌక ఫోష్‌మన్‌ నుంచి గ్వాంగ్జూ వైపు ప్రయాణిస్తోంది. ఈ క్రమంలో మార్గ మధ్యలో ఉన్న లిజింగ్షా వంతెనను బలంగా ఢీకొంది. ప్రమాదం జరిగిన సమయంలో ఈ నౌకలో ఎటువంటి లోడు లేదని స్థానిక ప్రభుత్వ మీడియా వెల్లడించింది. ఆ సమయంలో వంతెనపై ట్రాఫిక్‌ తక్కువగా ఉన్నట్లు పేర్కొంది. 

ఈ ఘటనలో ఒక బస్సుతో సహా ఐదు వాహనాలు నదిలో పడిపోయాయి. ఇద్దరు వ్యక్తులు చనిపోగా.. మరో ముగ్గురి ఆచూకీ గల్లంతైంది. ప్రమాదం అనంతరం ఈ నౌక వంతెన మధ్యే చిక్కుకుపోయింది. నదిలో పడిపోయిన బస్సులో కేవలం డ్రైవర్‌ మాత్రమే ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. దీనికి కారణమైన నౌక కెప్టెన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. గ్వాంగ్జూ నగరం నుంచి ఆరుగురు డైవర్లతో కూడిన అత్యవసర సహాయక బృందాలు అక్కడికి చేరుకొన్నాయి. గాలింపు పూర్తయ్యాకే బాధితుల సంఖ్య తేలనుందని అధికారులు చెబుతున్నారు.  

జాహ్నవి కందుల మృతికి కారణమైన పోలీసుపై నేరాభియోగాల్లేవ్‌!

పెరల్‌ నది పరీవాహక ప్రాంతం చైనాలోని రద్దీగా ఉండే జలమార్గాల్లో ఒకటి. ఈ ఘటన జరిగిన నౌకాశ్రయం దేశంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రదేశం. వాస్తవానికి ఈ వంతెనను నౌకలు ఢీకొనే ముప్పు ఉండటంతో  నిర్మాణంలో మార్పులు చేయాలని గతంలోనే నిర్ణయించారు. కానీ, ఆ ప్రతిపాదన ముందుకు జరగలేదు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని