US Embassy: లెబనాన్‌లోని అమెరికా ఎంబసీ వద్ద కాల్పులు.. వ్యక్తి అరెస్టు

లెబనాన్‌లోని అమెరికా దౌత్యకార్యాలయం వద్ద ఓ వ్యక్తి కాల్పులకు తెగబడ్డాడు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అతడిని అరెస్టు చేశారు.

Updated : 05 Jun 2024 18:13 IST

బీరుట్‌: లెబనాన్‌ (Lebanon) రాజధాని బీరుట్‌లోని అమెరికా దౌత్యకార్యాలయం (US Embassy) వద్ద కాల్పుల చోటుచేసుకున్నాయి. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 8.30 గంటలకు అమెరికా దౌత్యకార్యాలయం వద్దకు ఓ వ్యక్తి తుపాకీతో వచ్చాడు. ఎంబసీ సమీపంలో విచ్చలవిడిగా కాల్పులకు తెగబడ్డాడు. వెంటనే స్పందించిన భద్రతా సిబ్బంది అతడిని అడ్డుకున్నారు. ఈ ఘటనలో ఎంబసీ సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు ‘ఎక్స్‌’ (ట్విటర్‌) వేదికగా వెల్లడించారు.

మోదీ హ్యాట్రిక్‌.. విదేశీ మీడియా ఎలా స్పందించిందంటే!

అతడిని అరెస్టు చేసిన పోలీసులు నిందితుడిని సిరియాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. అతడు కాల్పులు జరపడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఎంబసీ వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని