Donald Trump: ‘యాపిల్’కు ట్రంప్ వార్నింగ్.. అలాచేస్తే 25% సుంకం చెల్లించాల్సిందే!

ఇంటర్నెట్ డెస్క్: ఐఫోన్ల తయారీకి సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ‘యాపిల్’ సంస్థను మరోసారి హెచ్చరించారు. అమెరికాలో విక్రయించే ఐఫోన్లను (iphone) స్థానికంగానే తయారు చేయాలన్నారు. భారత్ లేదా మరే దేశంలో తయారు చేయొద్దని.. అలా చేస్తే కనీసం 25శాతం సుంకం ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేశారు.
‘‘అమెరికాలో విక్రయించే ఐఫోన్లను యునైటెడ్ స్టేట్స్‌లోనే తయారు చేయాలి. భారత్ లేదా మరో దేశంలో కాదని టిమ్ కుక్‌కు ఇదివరకే తెలియజేశా. అలా కుదరదంటే.. కనీసం 25శాతం సుంకాన్ని అమెరికాకు యాపిల్ చెల్లించాల్సిందే’’ అని అధ్యక్షుడు ట్రంప్ సొంత సామాజిక వేదిక ట్రూత్ సోషల్‌లో పోస్టు చేశారు. ఆ వెంటనే యాపిల్ షేరు విలువ మూడు శాతం పతనమైనట్లు తెలుస్తోంది.
చైనాపై అమెరికా సుంకాల ప్రభావం నేపథ్యంలో ఐఫోన్ల తయారీని భారత్‌లో చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు యాపిల్ ఇదివరకే వెల్లడించింది. ఈ విస్తరణ ప్రక్రియపై ఇటీవల స్పందించిన ట్రంప్.. దాన్ని నిలిపివేయాలని యాపిల్‌కు సూచించారు. భారత్‌లో యాపిల్ భారీగా తయారీ కార్యక్రమాలు చేపడుతోందని.. అది తనకు ఇష్టం లేదనే విషయాన్ని ఖతార్ పర్యటన సందర్భంగా ట్రంప్ వెల్లడించారు. తాజాగా ఇదే విషయంపై మళ్లీ స్పందించిన ఆయన.. అమెరికాలో తయారు చేయకుంటే సుంకాలు చెల్లించక తప్పదంటూ యాపిల్‌ను హెచ్చరించడం గమనార్హం.
ఈయూ దేశాలపై 50శాతం సుంకం
ఈయూ దేశాలపై ట్రంప్ సుంకాల కొరడా ఝళిపించారు. ఆయా దేశాలపై 50 శాతం సుంకం విధిస్తామని, జూన్ 1 నుంచి కొత్త టారిఫ్ అమల్లోకి వస్తుందని తెలిపారు. ఈయూతో జరిపిన చర్చలు ఫలవంతం కాలేదని, చర్చలు నిలిచిపోయిన నేపథ్యంలో ఈ సుంకాలు విధిస్తున్నట్లు పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

చిన్నారితో అసభ్య ప్రవర్తన.. హైదరాబాద్‌లో డ్యాన్స్ మాస్టర్ అరెస్టు
 - 
                        
                            

తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ విధానంపై అధ్యయనానికి కమిటీ ఏర్పాటు
 - 
                        
                            

బిహార్ అసెంబ్లీ పోరు.. ముగిసిన తొలిదశ ప్రచారం
 - 
                        
                            

విద్యార్థులతో కాళ్లు నొక్కించుకున్న టీచర్ సస్పెండ్
 - 
                        
                            

రోడ్డెక్కిన సీఎం.. ‘ఎస్ఐఆర్’కు వ్యతిరేకంగా నిరసనలు
 - 
                        
                            

ఛత్తీస్‌గఢ్‌లో రెండు రైళ్లు ఢీ.. పలువురు మృతి
 


