Russia: ఇద్దరు కీలక రష్యా కమాండర్ల మృతి..!
ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో రష్యా గత రెండు రోజుల్లో భారీ నష్టాలను చవిచూసింది. ఇద్దరు కీలక కమాండర్లు మృతి చెందడంతోపాటు.. దాదాపు నాలుగు విమానాలను నష్టపోయినట్లు వార్తలొస్తున్నాయి.
ఇంటర్నెట్‌డెస్క్: ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో రష్యా ఇద్దరు కీలక కమాండర్లను కోల్పోయింది. ఈ విషయాన్ని ఆ దేశ రక్షణ మంత్రిత్వశాఖ వెల్లడించింది. దొనెట్స్క్‌లో జరిగిన పోరాటంలో కర్నల్ వ్యాచెస్లావ్ మకరోవ్, కర్నల్ యెవ్జెనీ బ్రోవ్కో చనిపోయినట్లు పేర్కొంది. వీరు ఎక్కడ చనిపోయారు, మృతికి గల కారణాలను మాత్రం వెల్లడించలేదు. వీరిలో మకరోవ్ రష్యాకు చెందిన 4వ మోటరైజ్డ్ రైఫిల్ బ్రిగేడ్‌కు నాయకత్వం వహిస్తున్నారు. దీంతో ఆయనే వ్యక్తిగతంగా యుద్ధక్షేత్రానికి వెళ్లి దాడులను పర్యవేక్షించారు. మరో కమాండర్ బ్రోవ్కో కీలకమైన మిలటరీ-పొలిటికల్ వర్క్ విభాగానికి చెందిన ఆర్మీకోర్‌లో డిప్యూటీ కమాండర్‌గా చేస్తున్నాడు. శత్రువుతో జరిగిన పోరులో తీవ్రంగా గాయపడి ఈయన కన్నుమూసినట్లు రష్యా పేర్కొంది. దొనెట్స్క్ ప్రాంతంలో బక్ముత్ నగరంలో కొన్ని నెలలుగా తీవ్రమైన పోరు జరుగుతోంది. ఇక్కడ రష్యా దళాలకు మద్దతుగా వాగ్నర్ ప్రైవేటు సైన్యం కూడా పనిచేస్తోంది.
ఓకే రోజు నాలుగు విమానాలు కోల్పోయిన రష్యా..
రష్యా దళాలు శనివారం ఒకేరోజు నాలుగు యుద్ధవిమానాలను కోల్పోయింది. ఉక్రెయిన్‌తో యుద్ధం మొదలైన నాటి నుంచి ఈ స్థాయి నష్టాన్ని రష్యా వాయుసేన చవిచూడటం ఇదే తొలిసారి. రష్యా భూభాగంలోనే వీటిని కూల్చేసినట్లు వార్తలొస్తున్నాయి. కొన్ని వార్త సంస్థలు రెండు విమానాలు, రెండు హెలికాప్టర్లు కూలినట్లు పేర్కొంటున్నాయి. వీటిని మాస్కో ఇప్పటి వరకు ధ్రువీకరించలేదు. రష్యాలోని బ్రయాన్స్క్‌లో కూలిపోయిన వాటిల్లో సుఖోయ్ 34, సుఖోయ్ 35 ఫైటర్ జెట్‌లు, రెండు ఎంఐ-8 హెలికాప్టర్లు ఉన్నాయని రష్యాకు చెందిన ఓ మీడియా సంస్థ పేర్కొంది. వీటి కూల్చివేతలో తమ ఎయిర్ డిఫెన్స్ పాత్ర ఉందని మాత్రం ఇప్పటి వరకు ఉక్రెయిన్ వెల్లడించలేదు. కానీ, ఆ విమానాలు ఏవో సాంకేతిక సమస్యల్లో చిక్కుకొన్నాయని మాత్రం వెల్లడించింది.
మరోవైపు ఈ విమానాలు రష్యా భూభాగంలోనే కూలిపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇటీవల కాలంలో మాస్కో గ్లైడెడ్ ఆయుధాలను ఎక్కువగా వాడుతోంది. దీంతో వీటిని ఎదుర్కొనేందుకు ఉక్రెయిన్ గగనతల రక్షణ వ్యవస్థలను మరింత ముందుకు తీసుకెళ్లి ఉంటుందని రక్షణరంగ నిపుణులు భావిస్తున్నారు. ఒక హెలికాప్టర్ గాల్లో పేలిపోతున్న వీడియోను, ఓ ఫైటర్ జెట్ కూలిపోతున్న క్లిప్‌ను రష్యా న్యూస్ ఏజెన్సీ ‘టాస్’ ప్రదర్శించింది. కానీ, ఇవి కూలిపోవడానికి కారణాలను మాత్రం వెల్లడించలేదు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Andhra News: ఏపీ ప్రభుత్వ నిర్ణయం సరికాదు: సుప్రీంకోర్టు ధర్మాసనం
-
General News
Top Ten News @ 5PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Crime News
Crime news: కోర్కె తీర్చమంటే నో చెప్పిందని.. గర్ల్‌ఫ్రెండ్‌పై దారుణం
-
Politics News
Sattenapalli: కోడెల కుటుంబానికి న్యాయం చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు: నక్కా ఆనందబాబు
-
Sports News
WTC Final: ఆ సిరీస్ కంటే.. మాకిదే గ్రాండ్ ఫైనల్: ఆసీస్ టాప్ స్పిన్నర్ నాథన్ లైయన్
-
India News
Karnataka CM: ‘ఐదు గ్యారంటీల’కు కేబినెట్ గ్రీన్‌సిగ్నల్.. ఈ ఏడాదే అమలు!