Russia - Ukraine Conflict: లైవ్‌షో జరుగుతుండగా క్షిపణి దాడి.. రష్యన్ నటి మృతి

రష్యా ఆక్రమణలోఉన్న తూర్పు ఉక్రెయిన్‌ భూభాగంలో కళాకారులు ప్రదర్శన ఇస్తున్న ఆడిటోరియంపై మిసైల్ దాడి జరిగింది. ఈ ఘటనలో రష్యన్ నటి ఒకరు మృతి చెందారు. 

Published : 23 Nov 2023 18:10 IST

మాస్కో: రష్యా-ఉక్రెయిన్ (Russia-Ukraine Conflict) మధ్య జరుగుతున్న యుద్ధంలో సైనికులతోపాటు సామాన్య ప్రజలు సైతం ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా రష్యా ఆక్రమణలో ఉన్న తూర్పు ఉక్రెయిన్‌ భూభాగంలో ఉక్రెయిన్ క్షిపణి దాడి చేసింది. ఈ ఘటనలో రష్యన్ నటి పొలినా మెన్షిఖ్‌ (Polina Menshikh) మృతి చెందారు. ఈ విషయాన్ని రష్యన్‌ సైనికాధికారి ఒకరు ధ్రువీకరించారు. అంతర్జాతీయ వార్తా కథనాల ప్రకారం.. 

రష్యా ఆధీనంలో ఉన్న డొనెట్స్క్‌ ప్రాంతంలో ఉన్న రెండు రోజుల క్రితం పాఠశాల, సాంస్కృతిక కార్యక్రమాలు జరిగే ఆడిటోరియంపై హిమార్స్‌ క్షిపణులతో ఉక్రెయిన్‌ దాడి చేసింది. ఆ సమయంలో ఆడిటోరియంలో రష్యా సైన్యం కోసం నటి పొలినా ప్రదర్శన ఇస్తున్నారు. ఈ దాడిలో 25 మంది రష్యా సైనికులతో పాటు పొలినా మెన్షిఖ్ కూడా మృతి చెందగా, మరో 100 మంది గాయపడ్డారని ఉక్రెయిన్‌ సైనికాధికారి రాబర్ట్‌ బ్రోవ్డి ట్వీట్‌ చేశారు. రష్యా సైన్యం నిర్వహిస్తున్న అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం లక్ష్యంగా దాడి చేసినట్లు ఆయన తెలిపారు.  ప్రస్తుతం దీనికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. రష్యా మాత్రం దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కేవలం ఒక వ్యక్తి మాత్రమే ప్రాణాలు కోల్పోయినట్లు రష్యన్‌ సైనికాధికారి చెప్పారని స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి.

ఉక్రెయిన్‌తో శాంతి చర్చలకు సిద్ధమే.. జీ20 భేటీలో పుతిన్‌ వ్యాఖ్యలు

గతేడాది ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై రష్యా దాడి ప్రారంభమైన తర్వాత యుద్ధంలో పాల్గొంటున్న సైనికులకు సంఘీభావంగా కళాకారులు ప్రదర్శనలు నిర్వహించాలని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఆదేశించారు. ఇందులో భాగంగా రష్యా సైనికులు ఉంటున్న డొనెట్స్క్‌ ప్రాంతంలో పొలినా ప్రదర్శన ఇస్తున్న సమయంలో ఉక్రెయిన్ దాడి జరిగింది. 



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు