MEA: కేజ్రీవాల్‌పై వ్యాఖ్యలు.. మరోసారి అమెరికాకు భారత్‌ కౌంటర్‌

అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్టు వ్యవహారంలో అమెరికా చేసిన వ్యాఖ్యలపై భారత్‌ మరోసారి తీవ్ర అభ్యంతరం తెలిపింది. వాటిని అసమంజసమైనవిగా పేర్కొంది.

Published : 28 Mar 2024 21:40 IST

దిల్లీ: మద్యం విధానానికి (Delhi Excise Scam Case) సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో ఆప్‌ చీఫ్‌ కన్వీనర్, దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) అరెస్టు వ్యవహారంలో అమెరికా చేసిన (USA) వ్యాఖ్యలపై భారత్‌ మరోసారి తీవ్ర అభ్యంతరం తెలిపింది. వాటిని అసమంజసమైనవిగా పేర్కొంది.

కాంగ్రెస్‌ బ్యాంకు ఖాతాల వ్యవహారంపైనా అమెరికా వ్యాఖ్యలు!

‘‘భారత్‌ తన స్వతంత్ర, దృఢమైన ప్రజాస్వామ్య సంస్థల విషయంలో గర్విస్తోంది. వాటిని బయటి ప్రభావాల నుంచి రక్షించేందుకు కట్టుబడి ఉంది. దేశ ఎన్నికల, చట్టపరమైన ప్రక్రియల్లో బాహ్యశక్తుల ప్రమేయం ఆమోదయోగ్యం కాదు. ఈ వ్యవహారంపై ఇప్పటికే తీవ్ర నిరసన తెలియజేశాం’’ అని విదేశాంగ అధికార ప్రతినిధి రణ్‌ధీర్‌ జైస్వాల్‌ వెల్లడించారు. భారత్‌లో ప్రతిపక్ష నేత అరెస్టుకు సంబంధించిన నివేదికలను నిశితంగా పరిశీలిస్తున్నామని, ఈ కేసులో పారదర్శక విచారణను ప్రోత్సహిస్తున్నామని అగ్రరాజ్యం పేర్కొన్న విషయం తెలిసిందే.

ఆ నౌకలో 20 మంది భారతీయులు..

అమెరికాలోని బాల్టిమోర్‌లో వంతెనను ఢీకొన్న సరకు రవాణా నౌకలో మొత్తం 20 మంది భారతీయులు ఉన్నారని జైస్వాల్‌ తెలిపారు. అందరూ ఆరోగ్యంగా ఉన్నారని.. అయితే, ఒకరికి స్వల్ప గాయాలయ్యాయని చెప్పారు. నౌక సిబ్బందితోపాటు స్థానిక అధికారులకు భారత రాయబార కార్యాలయం అందుబాటులో ఉందని వెల్లడించారు. ఇటీవల పటాప్‌స్కో నదిపై ఉన్న ఫ్రాన్సిస్‌ స్కాట్‌ కీ వంతెనను నౌక ఢీకొనడంతో అది కాస్త కుప్పకూలింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని