పన్నూ హత్యకు కుట్ర.. భారతీయుడిపై అభియోగాలను తీవ్రంగా పరిగణించిన అమెరికా

సిక్కు వేర్పాటువాది హత్య కుట్రలో భారత వ్యక్తి ప్రమేయం ఉందన్న ఆరోపణలను అమెరికా (USA) సీరియస్‌గా తీసుకుంది. అదే సమయంలో భారత్‌ తమకు వ్యూహాత్మక భాగస్వామి అని వ్యాఖ్యానించింది. 

Updated : 01 Dec 2023 10:30 IST

దిల్లీ: సిక్కు వేర్పాటువాది హత్యకు కుట్ర పన్నాడని భారతీయుడిపై అమెరికా(USA) అభియోగాలను మోపింది. ఈ అంశాన్ని  తీవ్రంగా పరిగణిస్తున్నామని గురువారం శ్వేతసౌధ జాతీయ భద్రతా మండలి ప్రతినిధి జాన్‌ కిర్బీ వ్యాఖ్యానించారు. మరోపక్క భారత్‌(India)తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మెరుగుపర్చుకునే దిశగా ప్రయత్నాలను కొనసాగిస్తామని అన్నారు. 

కిర్బీ మీడియాతో మాట్లాడుతూ.. ‘భారత్‌ మాకు వ్యూహాత్మక భాగస్వామిగా కొనసాగుతోంది. ఆ భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకునే దిశగా మా చర్యలుంటాయి. అలాగే అమెరికాలో హత్యకు జరిగిన కుట్రను, ఆ కేసు దర్యాప్తును తీవ్రంగా తీసుకుంటాం. ఈ కేసును భారత్‌ కూడా సీరియస్‌గా తీసుకోవడం పట్ల మేం సంతోషంగా ఉన్నాం’ అని అన్నారు.

రామస్వామి అభ్యర్థిత్వానికి ఎదురుదెబ్బలు

సిక్కు వేర్పాటువాది హత్యకు కుట్ర పన్నాడని(Murder Plot) భారతీయుడిపై అమెరికా అభియోగాలను మోపడం ఆందోళన కలిగించే విషయమని గురువారం భారత్‌ అభిప్రాయపడింది. ఈ కేసులో అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసి విచారణ జరుపుతామని ప్రకటించింది. ఇందులో ఒక భారత అధికారి ప్రమేయముందని ఆరోపించడంపై ఆందోళన వ్యక్తం చేసింది.

ఇక ఈ అంశంపై అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ మీడియా అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. ‘ప్రస్తుతం ఇది కోర్టు పరిధిలో ఉంది. దీనిపై ఎక్కువగా మాట్లాడలేం. అలాగే ఈ కేసు గురించి ఇప్పటికే నేరుగా న్యూదిల్లీ వద్ద ప్రస్తావించాం. అక్కడి ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించడం మంచి పరిణామం’ అని బ్లింకెన్ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని