USA: చైనాను కట్టడి చేసేందుకు జపాన్‌కు దీర్ఘ శ్రేణి క్షిపణులు..!

జపాన్‌ తన రక్షణ రంగాన్ని బలోపేతం చేసుకొంటోంది. తాజాగా అమెరికా నుంచి భారీ సంఖ్యలో క్షిపణులను కొనుగోలు చేస్తోంది. చైనా నుంచి ముప్పు పెరుగుతున్న నేపథ్యంలో ఈ కొనుగోళ్లు చేయడం విశేషం. 

Published : 19 Nov 2023 16:06 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: చైనాను కట్టడి చేసేందుకు అమెరికా కీలక నిర్ణయం తీసుకొంది. జపాన్‌కు సుమారు 400 తోమహాక్‌ క్షిపణులను సరఫరా చేసేందుకు అమెరికా విదేశాంగశాఖ అనుమతులు మంజూరు చేసింది. ఓ వైపు చైనాతో చర్చలు జరుపుతూనే మరోవైపు రక్షణ రంగాన్ని బలోపేతం చేసుకొనే ప్రయత్నంలో భాగంగా జపాన్‌ వీటిని కొనుగోలు చేస్తోంది. ఈ డీల్‌ విలువ సుమారు 2.35 బిలియన్‌ డాలర్లు. దీని కింద రెండు రకాల తోమహాక్‌ క్షిపణులు కొనుగోలు చేయనుంది. వీటి రేంజి అత్యధికంగా 1,600 కిలోమీటర్ల వరకు ఉంటుంది. 

బందీల విడుదలపై హమాస్‌-ఇజ్రాయెల్‌ మధ్య ఒప్పందం..?

ఈ విక్రయంపై అమెరికా విదేశాంగ శాఖ స్పందిస్తూ ‘‘మా ప్రధాన మిత్రదేశం భద్రతను మెరుగుపరిస్తే అది ఇండోపసిఫక్‌ ప్రాంతంలో రాజకీయ సుస్థిరత, ఆర్థిక పురోగతికి కారణమవుతుంది. ప్రస్తుత, భవిష్యత్తులను ప్రమాదాలను ఎదుర్కోవడానికి ఈ విక్రయం జపాన్‌కు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఉపరితలంపై నుంచి ఉపరితలంపైకి ప్రయోగించే సంప్రదాయ ఆయుధాలతో పెరుగుతున్న ముప్పును నివారించవచ్చు’’ అని ఒక ప్రకటనలో పేర్కొంది. 

ఈ ఏడాది ఫిబ్రవరిలోనే జపాన్‌ ప్రధాని ఫూమియో కిషిద మాట్లాడుతూ తాము 400 క్షిపణులను కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించారు.   

మరోవైపు ఉత్తర కొరియా భారీగా క్షిపణుల తయారీపై దృష్టిపెట్టింది. తాజాగా ఈ క్షిపణుల కోసం ఘన ఇంధన ఇంజిన్లను ఇటీవలే పరీక్షించినట్లు అధికార వార్తాసంస్థ ప్రకటించింది. ఘన ఇంధన క్షిపణులతో ఈ సమస్య ఉండదు. వీటిని వేగంగా ప్రయోగించవచ్చు, తరలించవచ్చు, శత్రువు కంటపడకుండా దాచిపెట్టవచ్చు. ఉత్తర కొరియా వద్దనున్న మధ్యశ్రేణి క్షిపణులలో హ్వాసాంగ్‌-12 క్షిపణి.. పసిఫిక్‌ మహా సముద్రంలో అమెరికా ఆధీనంలోని గ్వామ్‌ దీవిని తాకగలవు. ఇటీవల ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ రష్యా వెళ్లినపుడు ఆ దేశ సాంకేతికత కోసం ప్రయత్నించి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో చైనా నుంచి ఈ దేశానికి బలమైన మద్దతు లభిస్తోంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని