Zaporizhzhia: రష్యా ప్రమాదకరమైన ఆట ఆడుతోంది.. అణువిద్యుత్కేంద్రం డ్రోన్‌ దాడిపై అమెరికా

Zaporizhzhia: జపోరిజియా కేంద్రంపై (Zaporizhzhia nuclear plant) డ్రోన్లతో ఉక్రెయిన్‌ దాడి చేసిందని ప్లాంట్‌ అధికారులు ఆదివారం తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రష్యా వెంటనే అక్కడి నుంచి వైదొలగాలని అమెరికా పిలుపునిచ్చింది.

Published : 09 Apr 2024 08:18 IST

వాషింగ్టన్‌: జపోరిజియా అణువిద్యుత్కేంద్రం (Zaporizhzhia nuclear plant) నుంచి రష్యా (Russia) సేనలు వెంటనే వైదొలగాలని అమెరికా (USA) పిలుపునిచ్చింది. దాని నిర్వహణను ఉక్రెయిన్‌కు అప్పగించాలని సూచించింది. ఈ కేంద్రంపై ఉక్రెయిన్‌ డ్రోన్‌ దాడి చేసిన నేపథ్యంలో అగ్రరాజ్యం స్పందించింది. అక్కడి పరిస్థితులను తాము నిశితంగా పరిశీలిస్తున్నామని తెలిపింది. ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడినా పెద్ద ప్రమాదం సంభవించొచ్చని హెచ్చరించింది.

‘‘జపోరిజియా అణువిద్యుత్కేంద్రంపై (Zaporizhzhia nuclear plant) డ్రోన్‌ దాడి సమాచారం మా దగ్గర ఉంది. అక్కడి పరిస్థితులను మేం పర్యవేక్షిస్తున్నాం. అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (IAEA) నుంచి కూడా నివేదికలు అందాయి. ఎలాంటి ప్రమాదం జరగలేదని.. అణు కేంద్ర భద్రతకు ముప్పు లేదని తెలిసి ఊరటచెందాం. ఐరోపాలోనే అతిపెద్ద అణువిద్యుత్కేంద్రాన్ని ఆక్రమించి రష్యా చాలా ప్రమాదకరమైన ఆట ఆడుతోంది. అణు ప్రమాదం జరిగే ఎలాంటి చర్యలకూ పాల్పడొద్దు’’ అని అమెరికా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్‌ అన్నారు.

రఫాను ఆక్రమిస్తాం: నెతన్యాహు

జపోరిజియా కేంద్రంపై (Zaporizhzhia nuclear plant) డ్రోన్లతో ఉక్రెయిన్‌ దాడి చేసిందని ప్లాంట్‌ అధికారులు ఆదివారం తెలిపారు. ఆరో పవర్‌ యూనిట్‌ డోమ్‌ను డ్రోన్లు తాకాయని, తీవ్ర నష్టమేమీ జరగలేదని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఉక్రెయిన్‌పై సైనికచర్య చేపట్టిన ఆరంభంలోనే జపోరిజియా కేంద్రాన్ని రష్యా దళాలు తమ అధీనంలోకి తీసుకున్నాయి. అప్పటి నుంచి ఈ కేంద్రం పరిసరాల్లో దాడులు, ప్రతిదాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఐరోపాలోని అతి పెద్ద అణువిద్యుత్కేంద్రమైన జపోరిజియా రక్షణపై అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఏఈఏ) కూడా పలుమార్లు ఆందోళన వ్యక్తం చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని