రఫాను ఆక్రమిస్తాం: నెతన్యాహు

దక్షిణ గాజా నగరమైన రఫాను ఆక్రమిస్తామన్న ప్రతినను ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహు పునరుద్ఘాటించారు.

Updated : 09 Apr 2024 05:57 IST

జెరూసలెం: దక్షిణ గాజా నగరమైన రఫాను ఆక్రమిస్తామన్న ప్రతినను ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహు పునరుద్ఘాటించారు. దానిపై దండెత్తేందుకు ఒక తేదీ ఉందని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో ప్రకటనను విడుదల చేశారు. హమాస్‌లకు చివరి బలమైన స్థావరంగా ఉన్న రఫాకు క్షేత్రస్థాయి బలగాలను పంపిస్తామని నెతన్యాహు గతంలోనూ పలుమార్లు చెప్పారు. అయితే అమెరికా సహా అంతర్జాతీయ సమాజం ఆయన మాటలను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. రఫాకు బలగాలను పంపిస్తే.. అక్కడ ఆశ్రయం పొందుతున్న సుమారు 14 లక్షల మంది పౌరుల జీవితాలు ప్రమాదంలో పడతాయంటూ ఆందోళన వ్యక్తం చేస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని