Osprey aircraft: జపాన్‌ సముద్రంలో కుప్పకూలిన అమెరికా సైనిక విమానం

అమెరికాకు చెందిన ఓ సైనిక విమానం (Osprey aircraft) జపాన్‌లో కుప్పకూలింది. ఆ సమయంలో విమానంలో ఎనిమిది మంది ఉన్నారు.

Published : 29 Nov 2023 14:50 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అమెరికాకు చెందిన ఓ సైనిక విమానం (Osprey aircraft) జపాన్‌ సముద్రంలో కుప్పకూలింది. ఆ సమయంలో విమానంలో ఎనిమిది మంది సైనిక సిబ్బంది ఉన్నారు. జపాన్‌లోని యకుషిమా దీవి సమీపంలో ఈ ప్రమాదం (Aircraft crash) చోటుచేసుకుంది. ఈ విషయాన్ని జపాన్‌ కోస్ట్‌ గార్డ్‌ ధ్రువీకరించింది. అయితే, అందులో ఉన్న వారి క్షేమ సమాచారం తెలియరాలేదు.

జపాన్‌ స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.47 గంటల సమయంలో ఓ విమానం కుప్పకూలినట్లు యకుషిమాకు చెందిన మత్స్యకారులు గుర్తించారు. వెంటనే వారు స్థానిక కోస్ట్‌గార్డ్‌కు సమాచారం అందించారు. దీంతో తక్షణమే స్పందించిన సహాయ బృందాలు (Rescue Operation).. ఘటనా స్థలానికి చేరుకొన్నాయి. విమానం ఎడమ ఇంజిన్‌ మండిపోతూ సముద్రంలో పడిపోయిందని అక్కడి మీడియాకు స్థానికులు వెల్లడించారు. ఈ ప్రమాదంపై అమెరికా సాయుధ బలగాల నుంచి ఎటువంటి స్పందన రాలేదు.

శ్వేతసౌధం, పెంటగాన్‌ ఫొటోలు తీసిన కిమ్‌ శాటిలైట్‌?

ఓస్ప్రే (Osprey) అనేది అమెరికా సైన్యానికి చెందిన ప్రత్యేకమైన విమానం. ఇది హెలికాప్టర్‌గా, విమానంగానూ (turboprop aircraft) పనిచేస్తుంది. ఈ ఏడాది ఆగస్టులో కూడా అమెరికా మెరైన్‌ విభాగానికి చెందిన రెండు ఓస్ప్రే విమానాలు డార్విన్‌ నుంచి 80 కిలోమీటర్ల దూరంలోని తివి ద్వీపానికి బయల్దేరాయి. వీటిల్లో ఒకటి కూలిపోయింది. ఇప్పటికే ఈ రకం  విమానాలు ఎక్కువగా ప్రమాదాలకు గురవుతున్నాయి. 2022లో ఈ రకం విమానం కూలి ఐదుగురు సైనిక సిబ్బంది చనిపోయారు. అదే ఏడాది నాటో శిక్షణ సమయంలో నార్వేలో మరొకటి కూలిపోయింది. ఆ ఘటనలో నలుగురు సిబ్బంది చనిపోయారు. 2017లో కూడా రెండు కూలిపోయాయి. 2000వ సంవత్సరం నుంచి దాదాపు 12 విమానాలు కూలిపోయాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని