Israel - Hamas : కాల్పుల విరమణకు ఇజ్రాయెల్‌ ఓకే.. ఎటూ తేల్చని హమాస్‌!

బందీలను విడుదల చేసేందుకు అంగీకరిస్తే.. కాల్పుల విరమణ పాటించేందుకు ఇజ్రాయెల్‌ సిద్ధంగా ఉందని అమెరికా తెలిపింది. 

Published : 03 Mar 2024 13:10 IST

వాషింగ్టన్‌: ఇజ్రాయెల్‌ - హమాస్‌ యుద్ధం (Israel-Hamas Conflict) కారణంగా గాజాలో పరిస్థితులు రోజు రోజుకీ దిగజారుతున్నాయి. హమాస్‌ వద్ద బందీలుగా ఉన్నవారిని విడిపించాలని ఇజ్రాయెల్‌పై ఒత్తిడి పెరుగుతోంది. ఈ క్రమంలో కాల్పుల విరమణ ఒప్పందానికి ఇజ్రాయెల్‌ అంగీకరించినట్లు అమెరికా ఉన్నతాధికారి తెలిపారు. అయితే, తన వైఖరిని హమాస్‌ ఇంకా స్పష్టం చేయలేదన్నారు. ‘‘బందీలను విడిచిపెట్టేందుకు అంగీకరిస్తే.. ఆరువారాల పాటు కాల్పుల విరమణ చేపట్టేందుకు ఇజ్రాయెల్‌ సిద్ధంగా ఉంది. ప్రస్తుతం బంతి హమాస్‌ కోర్టులో ఉంది. బందీల్లో వృద్ధులు, మహిళలు, గాయపడినవారు, అనారోగ్యంతో బాధపడే వారు ఉన్నారు. వాళ్లను విడిచిపెట్టేందుకు హమాస్‌ అంగీకరిస్తే కాల్పులు విరమణ తక్షణం అమల్లోకి వస్తుంది’’ అని తెలిపారు. 

హైతీలో జైలు బద్దలు.. వందల మంది ఖైదీల పరారు..!

మార్చి 10 నుంచి రంజాన్‌ నెల ప్రారంభం కానున్న నేపథ్యంలో అంతకుముందే.. ఇరువర్గాల మధ్య ఒప్పందం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరోవైపు యుద్ధం కారణంగా గాజాలో తీవ్ర ఆహార సంక్షోభం తలెత్తింది. మానవతా సాయం అందించే యూఎన్‌ ట్రక్కులపై దాడులు జరుగుతుండటంతో గాజావాసులకు ఉపశమనం కలిగించేందుకు అమెరికా రంగంలోకి దిగింది. శనివారం మూడు సైనిక రవాణా విమానాల సాయంతో 38 వేల ఆహార పొట్లాలను జారవిడిచింది. ఈ క్రమంలోనే జోర్డాన్‌ సమన్వయంతో ఆహార పొట్లాల పంపిణీ ప్రారంభించారు. ఇది నిరంతర ప్రక్రియ అని వైట్‌హౌస్‌ ప్రతినిధి ఒకరు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని