Guinness World Record: గోళ్లు పెంచి.. గిన్నిస్ రికార్డ్‌ కొట్టి..!

ప్రపంచంలోనే అత్యంత పొడవైన గోళ్లు కలిగిన వ్యక్తిగా అమెరికాకు చెందిన డయానా ఆర్మ్‌స్ట్రాంగ్ అనే  మహిళ గిన్నిస్‌ రికార్డ్‌ పొందింది.

Published : 25 May 2024 16:49 IST

ఇంటర్‌నెట్‌ డెస్క్‌: అమెరికాకు చెందిన డయానా ఆర్మ్‌స్ట్రాంగ్ (Diana Armstrong) అనే  మహిళ గిన్నిస్‌ రికార్డు సృష్టించారు. ప్రపంచంలోనే అత్యంత పొడవైన గోళ్లు  కలిగిన మహిళగా గిన్నిస్‌ రికార్డును (Guinness World Record) సొంతం చేసుకున్నారు. ఆమె చేతి వేళ్లకు 1,306.58 సెం.మీ (42 అడుగుల 10.4 అంగుళాల) పొడవైన గోళ్లు  ఉన్నట్లు గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు ప్రతినిధులు వెల్లడించారు. ఆమె 25 ఏళ్లుగా తన గోళ్లను పెంచుతోందని, అవి మినీ స్కూల్‌ బస్సు కంటే పొడవుగా ఉన్నాయని వారు తెలిపారు.

1997లో తన పెద్ద కుమార్తె లతీషా ఆస్తమాతో మరణించడంతో డిప్రెషన్ లోకి వెళ్లానని డయానా తెలిపారు. లతీషాకు పొడవైన గోళ్లంటే ఇష్టమని అందుకే అప్పటినుంచి తన కూతురి గుర్తుగా గోళ్లు పెంచుతున్నానని ఆమె పేర్కొన్నారు. అవి అందంగా కనిపించేందుకు వివిధ రంగులతో తరచూ పెయింట్‌ చేసుకుంటానని తెలిపారు. తాజాగా ప్రపంచ రికార్డు సాధించడంతో ఆమె ఆనందం వ్యక్తంచేశారు. దీనికి సంబంధించిన పోస్టును గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ తన అధికారిక ఎక్స్‌ (ట్విటర్‌) ఖాతాలో పోస్టు చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు