వీసా లేకుండా పర్యటనల కోసం.. భారత్‌, రష్యా త్వరలో చర్చలు!

వీసారహిత బృంద పర్యటనలను అనుమతించే విషయాన్ని చర్చించేందుకు భారత్‌, రష్యాలు జూన్‌లో తొలివిడత చర్చలు జరపనున్నాయి.

Published : 17 May 2024 18:54 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: స్థానికంగా పర్యటకాన్ని మరింత వృద్ధి చేసుకునేందుకు వీసా లేకుండానే విదేశీయులను పలు దేశాలు అనుమతిస్తున్నాయి. ఈ క్రమంలో వీసారహిత పర్యటనలను అనుమతించే విషయాన్ని చర్చించేందుకు భారత్‌, రష్యాలు సిద్ధమవుతున్నాయి. ఇందుకు సంబంధించి ద్వైపాక్షిక ఒప్పందాల సాధ్యాసాధ్యాలపై జూన్‌లో తొలివిడత చర్చలు జరగనున్నాయి. ఈ ఏడాది చివరికి ఇరుదేశాల మధ్య ఒప్పందాలు ఖరారయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

‘వీసారహిత పర్యటన అనుమతుల్లో అంతర్గత సమన్వయం కోసం భారత బృందంతో సంప్రదింపులు జరుపుతున్నాం. అవి తుది దశలో ఉన్నాయి. ప్రతిపాదిత ఒప్పందంపై త్వరలోనే చర్చిస్తాం. జూన్‌లోనే తొలిదశ చర్చలు నిర్వహిస్తాం. ఏడాది చివరికి ఒప్పందం ఖరారయ్యే అవకాశం ఉంది’ అని రష్యా ఆర్థికాభివృద్ధి మంత్రిత్వశాఖకు చెందిన నికితా కొంద్రాత్యేవ్‌ పేర్కొన్నారు.

యూఏఈ నుంచి ఇక ‘బ్లూ రెసిడెన్సీ వీసా’.. ఎవరికంటే..?

విదేశీ పర్యటకులను ఆకర్షించేందుకు అనేక చర్యలు తీసుకుంటున్న రష్యా.. ఇటు భారత్‌తోనూ వీసా రహిత బృంద ప్రవేశాలను అనుమతించాలనే ఉద్దేశాన్ని ఇటీవల వ్యక్తంచేసింది. ఇరు దేశాల పర్యటక, ఆర్థిక ప్రణాళికల్లో భాగంగా దీన్ని అమలు చేయనున్నట్లు వెల్లడించింది. ఇప్పటికే చైనా, ఇరాన్‌ దేశాలతో ఈతరహా ఒప్పందాలు చేసుకున్న పుతిన్‌ ప్రభుత్వం.. గతేడాదినుంచే అమలుచేస్తోన్న సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు