Modi-Putin: మోదీపై ఒత్తిడి తేవడం అసాధ్యం: రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ప్రశంసలు

భారత్‌-రష్యా(India-Russia) మధ్య సంబంధాలు నిరంతరం అభివృద్ధి చెందుతున్నాయని రష్యా అధ్యక్షుడు పుతిన్(putin) అన్నారు. అలాగే మోదీ విధానాలను ప్రశంసించారు. 

Updated : 08 Dec 2023 11:39 IST

దిల్లీ: రష్యా అధ్యక్షుడు పుతిన్(Putin) మరోసారి భారత ప్రధాని మోదీ(Modi)పై ప్రశంసలు కురిపించారు. భారత ప్రజల ప్రయోజనాల కోసం మోదీ కఠిన నిర్ణయాలు తీసుకుంటారని  కొనియాడారు. రష్యా, భారత్ మధ్య లోతైన బంధాలకు ఆయన విధానాలే గ్యారంటీ అని వ్యాఖ్యానించారు. ఓ ఇంటర్వ్యూలో భాగంగా ఆయన హిందీలో మాట్లాడటం విశేషం.

‘భారత్‌, భారత ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకంగా మోదీపై ఒత్తిడి తీసుకురావడం అసాధ్యం. ఆయన ప్రభుత్వంపై అలాంటి ఒత్తిడి ఉంటుందని నాకు తెలుసు. అయితే ప్రజల కోసం ఆయన తీసుకునే కఠిన వైఖరిని చూసి కొన్నిసార్లు ఆశ్చర్యమేస్తుంటుంది. అలాగే భారత్‌, రష్యా సంబంధాలు నిరంతరం అభివృద్ధి చెందుతున్నాయి. మోదీ అనుసరిస్తోన్న విధానాలే అందుకు గ్యారంటీ’ అని ప్రధానిపై పుతిన్‌(Putin) ప్రశంసలు కురిపించారు. ఓ ఇంటర్వ్యూలో భాగంగా ఆయన హిందీలో మాట్లాడటం ఆశ్చర్యపరుస్తోంది. కృత్రిమ మేధ సహాయంతో అనువాదం చేయడం వల్లే అది సాధ్యమైందని ఆయన్ను ఇంటర్వ్యూ చేసిన మీడియా సంస్థ వెల్లడించింది. 

ఆత్మహత్యా..? చిత్రహింసలు పెట్టి చంపేశారా..?: అదృశ్యమైన చైనా నేతపై కథనాలు

గతంలో కూడా పలు సందర్భాల్లో మోదీ(Modi) విధానాలను పుతిన్‌ అభినందించారు. మోదీ సారథ్యంలో భారత్‌ చాలా పురోగతి సాధించిందన్నారు. ఆయన దేశభక్తుడని అభివర్ణించారు. ‘‘మేకిన్‌ ఇండియా’ ఆలోచన ఆర్థికంగా, నైతికంగా చాలా కీలకమైంది. భవిష్యత్తు భారత్‌దే. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అయినందుకు భారత్‌ గర్వించాలి’’ అని పుతిన్‌ వ్యాఖ్యానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని