Pakistan: ముందుగా మేము అణు పరీక్షలను పునరుద్ధరించం: పాక్‌

Eenadu icon
By International News Team Updated : 04 Nov 2025 13:11 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఇంటర్నెట్‌ డెస్క్‌: రష్యా, చైనా, ఉత్తరకొరియా, పాకిస్థాన్‌ వంటి దేశాలు అణ్వాయుధాలను పరీక్షిస్తున్నాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ (Trump on Nuclear Tests) చేసిన వ్యాఖ్యలపై ఇస్లామాబాద్‌ స్పందించింది. ఈ విషయంపై పాకిస్థాన్‌కు చెందిన ఓ ఉన్నతాధికారి (Pakistani official) అంతర్జాతీయ మీడియాకు వివరణ ఇస్తూ.. తామెప్పుడు ఇతర దేశాల కంటే ముందుగా అణు పరీక్షలను పునరుద్ధరించబోమన్నారు. అణు పరీక్షలను నిర్వహించిన మొదటి దేశం పాక్‌ కాదని.. అదేవిధంగా అణు పరీక్షలను తిరిగి ప్రారంభించే మొదటి దేశంగానూ తాము ఉండబోమని స్పష్టం చేశారు. 

ఈ విషయంపై చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి మావో నింగ్ (Mao Ning) సైతం స్పందించారు. బాధ్యతాయుతమైన అణ్వాయుధ దేశంగా చైనా ఎల్లప్పుడూ ఆత్మరక్షణ అణువ్యూహాన్ని సమర్థిస్తుందన్నారు. అణు పరీక్షలు నిలిపివేయాలనే విషయంలోనూ తాము అదే నిబద్ధతకు కట్టుబడి ఉంటామన్నారు. 

అమెరికా చేస్తున్న అణు పరీక్షలను సమర్థించుకున్న ఆ దేశాధ్యక్షుడు ట్రంప్‌ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలో చాలా దేశాలు చురుగ్గా అణ్వాయుధాలను (Trump on Nuclear Tests) పరీక్షిస్తున్నాయన్నారు. ఈ జాబితాలో పాకిస్థాన్‌ (Pakistan) కూడా ఉందని పేర్కొన్నారు. ‘‘రష్యా, చైనా, ఉత్తరకొరియా, పాకిస్థాన్‌ వంటి దేశాలు అణు పరీక్షలు (Nuclear Tests) నిర్వహిస్తున్నాయి. కానీ, వీటి గురించి ఆయా దేశాలు మాట్లాడట్లేదు.  మేం అలా కాదు. ఏదైనా బహిరంగంగానే చేస్తాం. దాని గురించి మాట్లాడతాం. ఇన్నాళ్లూ ఎన్ని దేశాలు అణు పరీక్షలు చేపట్టినా మేం వాటి జోలికి వెళ్లలేదు. ఇకపై అలా మిగిలిపోవాలనుకోవట్లేదు. ఇతర దేశాల మాదిరిగానే మేమూ ఈ పరీక్షలు నిర్వహిస్తాం’’ అని ట్రంప్‌ వెల్లడించారు. 

అణ్వాయుధాలకు ఉన్న విధ్వంసకర శక్తి కారణంగా ఆ పరీక్షలు చేయకూడదని గతంలో అధికారంలో ఉన్నప్పుడు నిర్ణయించుకున్నా. ఇప్పుడు పరిస్థితులు మారాయని ట్రంప్‌ అన్నారు. రష్యా, చైనా సహా ఇతర దేశాలు వేగంగా తమ అణుసామర్థ్యాలను పెంచుకుంటున్న నేపథ్యంలో మళ్లీ అణ్వాయుధ పరీక్షలు ప్రారంభించాల్సిందిగా అమెరికా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ వార్‌కు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. 

Tags :
Published : 04 Nov 2025 13:04 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు