Miss AI: ‘ఏఐ’ భామలకు.. అందాల పోటీ..!

కృత్రిమ మేధతో సృష్టించిన సుందరాంగుల కోసం ‘మిస్‌ ఏఐ’ పోటీ సిద్ధమైంది. మిస్‌ ఇండియా వంటి పోటీల మాదిరిగానే వీటి ప్రతిభను పరీక్షించి ప్రైజ్‌ మనీ ఇవ్వనున్నారు.

Published : 17 Apr 2024 00:07 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కృత్రిమ మేధ (Artificial Intelligence) కొత్త పుంతలు తొక్కుతోంది. ఈ టెక్నాలజీతో పుట్టుకొచ్చిన అందాల భామలు నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్నారు. రీల్స్‌, వాణిజ్య సంస్థల ప్రచారం, ప్రకటనల ద్వారా వారి సందడి మామూలుగా లేదు. అసలు నిజమైన అమ్మాయిలు కాదంటే నమ్మలేని పరిస్థితి. అందుకే ఈ సుందరాంగుల కోసం ‘మిస్‌ ఏఐ (Miss AI)’ పోటీ సిద్ధమైంది. ‘మిస్‌ ఇండియా’ వంటి పోటీల మాదిరిగానే వీటి ప్రతిభను పరీక్షించి.. ప్రైజ్‌ మనీ ఇవ్వనున్నారు. వరల్డ్ ఏఐ క్రియేటర్ అవార్డ్స్‌ (WAICA) ఈ విషయాన్ని వెల్లడించిందని మీడియా కథనాలు పేర్కొన్నాయి.

సాంకేతిక తప్పిదం.. వేరే జంటకు విడాకులు

ఈ మొట్టమొదటి ‘Miss AI’ పోటీలో మోడల్స్‌, ఇన్‌ఫ్లుయెన్సర్లు పోటీ పడనున్నారు. దీనికింద 20 వేల డాలర్ల ప్రైజ్‌మనీ ఇవ్వనున్నారు. ఈ భామల లుక్స్‌, వీటి క్రియేషన్స్‌ వెనక ఉపయోగించిన సాంకేతిక నైపుణ్యాలు, సోషల్‌ మీడియాలో అవి చూపుతున్న ప్రభావం వంటి వాటిని నిర్ణేతలు పరిగణనలోకి తీసుకోనున్నారు. నిర్ణేతల్లో ఇద్దరు ఏఐ ఇన్‌ఫ్లూయెన్సర్లు ఉండటం విశేషం. విజేతలను మే 10న ప్రకటించనున్నారు. ఈ ఆదివారం నుంచి దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని