Divorce: సాంకేతిక తప్పిదం.. వేరే జంటకు విడాకులు!

కంప్యూటర్‌లో ఓ సంస్థ చేసిన చిన్న పొరబాటు వల్ల ఒక జంటకు ముందస్తుగానే విడాకులు మంజూరైన ఘటన బ్రిటన్‌లో చోటుచేసుకొంది.

Updated : 16 Apr 2024 19:18 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఓ సంస్థ చేసిన చిన్న పొరబాటు కారణంగా ఒక జంటకు అనుకోకుండా విడాకులు మంజూరైన ఘటన ఇది. ఆన్‌లైన్‌ వేదికగా విడాకులకు దరఖాస్తు చేసుకున్న దంపతులు.. చర్చల దశలో ఉండగానే వారికి ఊహించని పరిణామం ఎదురైంది. కోర్టుకు సమర్పించే పత్రాల్లో వేరే జంటకు బదులు వీరి పేరు చేర్చడమే అందుకు కారణం. న్యాయమూర్తి తీర్పుతో నిమిషాల వ్యవధిలోనే వీరికి విడాకులు మంజూరుకావడం గమనార్హం. అసలేం జరిగిందంటే..

యూకేకి చెందిన విలియమ్స్‌ అనే మహిళకు 21 ఏళ్ల క్రితం వివాహమైంది. గతేడాది నుంచి దంపతులు విడివిడిగా ఉంటున్నారు. ఈనేపథ్యంలో వార్దాగ్స్‌ అనే ఓ ప్రముఖ సంస్థను సదరు మహిళ ఆశ్రయించారు. దంపతుల మధ్య ఆర్థిక అంశాలు సంప్రదింపుల దశలో ఉండగానే.. మరో క్లయింట్‌ తుది విడాకుల కోసం రూపొందించిన పత్రాల్లో పొరబాటున విలియమ్స్‌ దంపతుల పేరును చేర్చారు. ఈ పత్రాలను అలాగే కోర్టులో దాఖలు చేశారు.

‘అమెరికాలో హిందువులపై దాడులు పెరిగాయ్‌’ - చట్టసభ సభ్యుల ఆందోళన

దీనిపై విచారించిన న్యాయస్థానం.. కేవలం 21 నిమిషాల వ్యవధిలోనే ఆ పత్రాల్లో ఉన్న జంటకు విడాకులు మంజూరుచేసింది. ఈ తప్పిదాన్ని కొన్ని రోజుల తర్వాత ఆ సంస్థ గుర్తించింది. తాము అందజేసిన పత్రాల్లో పొరపాటు జరిగిందని, వీటిని రద్దు చేయాలని కోరుతూ విలియమ్స్‌ తరఫు న్యాయవాదులు కోర్టును ఆశ్రయించారు. కానీ, వారి అభ్యర్థనను న్యాయస్థానం తిరస్కరించింది.

వార్దాగ్స్‌ వ్యవస్థాపకులు అయేషా వర్దాగ్ స్పందిస్తూ..‘‘ఇది తప్పుడు నిర్ణయం. కొందరు చేసిన తప్పిదాల ఆధారంగా విడాకులు ఇవ్వకూడదు. విడాకులు కోరుకునే వ్యక్తులు ఉద్దేశం కచ్చితంగా ఉండాలి. ఇది న్యాయవ్యవస్థ నిర్ణయాన్ని బలపరుస్తుంది. సాంకేతిక తప్పు జరిగిందని గుర్తించి, దాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లినప్పుడు.. వాటిని పరిగణనలోకి తీసుకోవాలి’’ అని వ్యాఖ్యానించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని