మే 31 నాటికి కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు!

దేశ వ్యవసాయానికి జీవనాడులైన నైరుతి రుతుపవనాలు.. భారత భూభాగంలోని నికోబార్ దీవుల మీదుగా ప్రయాణిస్తున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. మాల్దీవుల్లోని కొన్ని ప్రాంతాలతో పాటు, కొమోరిన్, దక్షిణ బంగాళాఖాతం, నికోబార్ దీవుల మీదుగా ప్రయాణిస్తున్న నైరుతి రుతుపవనాలు.. మే 31 నాటికి కేరళను తాకనున్నట్లు వెల్లడించింది.

Updated : 19 May 2024 20:18 IST

దేశ వ్యవసాయానికి జీవనాడులైన నైరుతి రుతుపవనాలు.. భారత భూభాగంలోని నికోబార్ దీవుల మీదుగా ప్రయాణిస్తున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. మాల్దీవుల్లోని కొన్ని ప్రాంతాలతో పాటు, కొమోరిన్, దక్షిణ బంగాళాఖాతం, నికోబార్ దీవుల మీదుగా ప్రయాణిస్తున్న నైరుతి రుతుపవనాలు.. మే 31 నాటికి కేరళను తాకనున్నట్లు వెల్లడించింది. లా నినా పరిస్థితులు, పసిఫిక్ మహాసముద్ర భూమధ్య రేఖ ప్రాంతం చల్లబడటం వంటి కారణాలతో ఈసారి భారత్‌లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ పరిణామం భారత్‌కు భారీ ఊరట కలిగిస్తోంది.

Tags :

మరిన్ని