తెదేపా ప్రచారంలో పాల్గొన్నారని.. ఇల్లు కూల్చేసిన వైకాపా నాయకులు

నెల్లూరు జిల్లా విడవలూరు మండలంలో తెలుగుదేశం పార్టీ ప్రచారంలో పాల్గొన్నందుకు ఓ జనసైనికుడి పూరిల్లుని కూల్చేశారు. కోవూరు నియోజకవర్గ తెదేపా, జనసేన, భాజపా ఉమ్మడి అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి ఈ నెల 27న విడవలూరు మండలం రామచంద్రాపురం గ్రామంలో ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో స్థానిక జనసేన కార్యకర్త కృష్ణ, అనిత దంపతులు పాల్గొన్నారు. దీంతో వీరిపై వైకాపా నేతలు కక్షసాధింపు చర్యలకు దిగారు.

Published : 30 Mar 2024 19:41 IST
Tags :

మరిన్ని