YS Family: కడప గడపలకు వైఎస్‌ కుటుంబం.. రసవత్తరంగా రాజకీయం

కడపలో రాజకీయం రసవత్తరంగా మారింది. రెండుగా విడిపోయిన వైఎస్ ఆర్ కుటుంబ సభ్యులు.. ఎవరికి వారే ప్రచారంతో హోరెత్తిస్తున్నారు.

Published : 29 Apr 2024 12:27 IST

కడపలో రాజకీయం రసవత్తరంగా మారింది. రెండుగా విడిపోయిన వైఎస్ ఆర్ కుటుంబ సభ్యులు.. ఎవరికి వారే ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. 2019 ఎన్నికల్లో క్రిస్టియన్ల ఓట్లను వైకాపాకు వచ్చేలా కృషి చేసిన బ్రదర్ అనిల్ కుమార్.. ఈసారి ఆ పార్టీకి వ్యతిరేకంగా ఓటర్లను ప్రభావితం చేసేలా చర్చిల్లో సమావేశాలు నిర్వహిస్తున్నారు. భార్య షర్మిలకు మద్దతుగా నిలిచేందుకు పాస్టర్లతో భేటీ అవుతున్నారు. సునీత కూడా షర్మిలకు ఓట్లు వేయాలని ప్రచారం చేస్తున్నారు. మరోవైపు వైకాపా అభ్యర్థులకు మద్దతుగా సీఎం జగన్  సతీమణి భారతి ఇంటింటికీ తిరుగుతూ ఓట్లు అడుగుతున్నారు.

Tags :

మరిన్ని