BRS-Congress: ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి వ్యాఖ్యలపై మండిపడ్డ కాంగ్రెస్‌ నేతలు

Eenadu icon
By Video News Team Published : 15 Apr 2025 17:11 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE

కాంగ్రెస్‌ పాలనలో స్థిరాస్తి వ్యాపారులు, గుత్తేదారులు విసుగుచెంది భారాసకు మద్దతు తెలిపేందుకు ముందుకొస్తున్నట్లు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలను ప్రభుత్వం ఖండించింది. పదేళ్లు ఇష్టానుసారంగా దోచుకున్న భారాస నేతల గుండెల్లో భూభారతి రాకతో రైళ్లు పరిగెడుతున్నాయని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు. వారి బండారం బయటపడుతుందన్న ఆందోళనతో ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ప్రభాకర్‌ రెడ్డి వ్యాఖ్యలపై విచారణ జరపాలని సీఎం రేవంత్‌ను కోరుతామని విప్‌ ఆది శ్రీనివాస్‌ తెలిపారు. ఈ వార్త చదివారా: పార్టీ గీత దాటితే ఊరుకునేది లేదు: సీఎం రేవంత్‌రెడ్డి

Tags :

మరిన్ని

సుఖీభవ

చదువు