Adani-Jagan: మంత్రివర్గం ఆమోదం లేకుండానే విద్యుత్‌ విక్రయ ఒప్పందాలు..!

Eenadu icon
By Video News Team Published : 27 Nov 2024 12:33 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE

అదానీ సంస్థతో గత జగన్ సర్కార్ కుదుర్చుకున్న విద్యుత్ ఒప్పందాల వ్యవహారంలో సరికొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అజూర్ పవర్‌కు బదులు అదానీ నుంచి 2333 మెగావాట్ల విద్యుత్‌ కొనుగోలుకు ఆ సంస్థతో రెండు వేర్వేరు అనుబంధ ఒప్పందాలు కుదుర్చుకోవడానికి సెకికి ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ అనుమతులిచ్చేశారు. మంత్రివర్గ ఆమోదం లేకుండానే ఈ అనుబంధ ఒప్పందాలు జరిగాయి. వ్యవహారమంతా చక్కబెట్టేశాక ఏపీపీసీసీ ఛైర్మన్ హోదాలో తన నిర్ణయాలకి ర్యాటిఫికేషన్ కోరుతూ ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. విచిత్రమేమిటంటే.. ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్నది కూడా ఆయనే. అలా ఈ ఒప్పందంలో ఆయన తీవ్ర ఉల్లంఘనలకు పాల్పడ్డారు. ఈ వార్త చదివారా: నన్ను హింసించిన వారంతా జైలుకు వెళ్లడం ఖాయం: రఘురామ

Tags :

మరిన్ని

సుఖీభవ

చదువు