Adani: పేరుకే సెకి.. అసలు విద్యుత్‌ ఒప్పందం అదానీతోనే..!

Eenadu icon
By Video News Team Published : 28 Nov 2024 12:09 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE

కేంద్ర సౌర విద్యుత్ సంస్థ-సెకీ నుంచి 7 వేల మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు నాటి జగన్ ప్రభుత్వం పేరుకే ఒప్పందం చేసుకుంది. అసలు ఒప్పందం అదానీతోనేనని అనుబంధ ఒప్పందాల్ని బట్టి స్పష్టమవుతోంది. సెకితో చేసుకున్న ప్రధాన ఒప్పందంలో అదానీ, అజూర్‌ సంస్థల పేర్లు కనిపించకుండా జాగ్రత్తపడినా, అనుబంధ ఒప్పందాల్లో వాటి ప్రస్తావన ఉంది. 7వేల మెగావాట్ల విద్యుత్‌ సరఫరా చేసేదీ, భారీగా లబ్ధి పొందేదీ అదానీ సంస్థేనని అనుబంధ ఒప్పందాల్ని బట్టి స్పష్టమవుతోంది. అదానీ నుంచి గత ‘ప్రభుత్వ పెద్దకు’ భారీగా లంచాలు ముట్టాకే పని పూర్తయిందనడానికి ఆ ఒప్పందాలే బలం చేకూరుస్తున్నాయి. ఈ వార్త చదివారా: జగన్‌ అవినీతిపరుడు కాకపోతే ఆయన బిడ్డలపై ప్రమాణం చేయాలి

Tags :

మరిన్ని

సుఖీభవ

చదువు