
ప్రధానాంశాలు
వార్డుల పునర్విభజనతో కష్టాలు
పోలింగ్ సమీపిస్తున్న వేళ గందరగోళం
ఓటర్లు, అభ్యర్థుల తికమక
ఈనాడు - అమరావతి
* వార్డుల పునర్విభజనలో విజయవాడ 11వ డివిజన్ ఏపీఐఐసీ కాలనీ పరిధిలోని పలువురు ఓటర్లను నాలుగో డివిజన్లో చేర్చడంతో ప్రజలు, అభ్యర్థులు తికమక పడుతున్నారు.
* విశాఖలోని మాధవధార, మురళీనగర్, కళింగనగర్ ప్రాంతాలు 30, 39 డివిజన్లలో ఉండేవి. పునర్విభజనలో వీటిని 49, 50, 51గా 3డివిజన్లు చేశారు. ఓటర్ల జాబితాలు ఆ ప్రకారం తయారు కానందున ఒక డివిజన్ ఓట్లు మరో డివిజన్లో ఉండటం గందరగోళానికి దారి తీస్తోంది.
పుర, నగరపాలక సంస్థల్లో వార్డుల పునర్విభజన సరిగా చేయనందున ఎన్నికల సమయంలో గందరగోళం నెలకొంది. ఒక డివిజన్, వార్డుల్లోనే నివసించేవారి ఓట్లు ఒక్కో చోట ఉండటంతో ఇటు ఓటర్లు, అటు అభ్యర్థులు తికమకపడుతున్నారు. మరో 3 రోజుల్లో పోలింగ్ నిర్వహిస్తున్న దశలో ఓట్లు ఎక్కడున్నాయో తెలుసుకోవడం ప్రజలకు, పోటీ చేస్తున్న అభ్యర్థులకు పరీక్షగా మారింది. పుర, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీల్లో డివిజన్లు, వార్డుల పునర్విభజన ప్రక్రియను ఏడాది క్రితం పురపాలక శాఖ చేపట్టింది. కనిష్ఠంగా 2,250, గరిష్ఠంగా 2,750 ఓటర్లకో డివిజన్, వార్డు ఉండేలా అప్పట్లో నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో పలు నగరాలు, పట్టణాల్లో డివిజన్లు, వార్డుల సంఖ్య పెరిగింది. వార్డుల పునర్విభజన ప్రక్రియ పూర్తయ్యాక మొదటిసారి నిర్వహిస్తున్న ఈ ఎన్నికల్లో వాటిలో లోపాలు ఇప్పుడు ఓటర్లకు చుక్కలు చూపిస్తున్నాయి. 10న నిర్వహించే పోలింగ్లో 90.61 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. పుర, నగరపాలక సంస్థల్లో డివిజన్లు, వార్డులవారీగా తయారుచేసిన ఓటర్ల జాబితాలను రాజకీయ పార్టీలకు ఇప్పటికే అందివ్వడంతోపాటు పురపాలకశాఖ వెబ్సైట్లోనూ అధికారులు పెట్టారు. పునర్విభజనలో ఒక డివిజన్, వార్డులోని ప్రాంతాలు పక్కనే ఉన్న మరో ప్రాంతంలో కలిసినపుడు అదేలా ఓటర్ల జాబితాలు సిద్ధం చేసి ఉంటే ఇబ్బంది ఉండేది కాదు. అలాంటి మార్పులు చేయకపోవడంతో ఎవరి ఓటు ఎక్కడ ఉందో.. ఏ పోలింగ్ కేంద్రంలో ఓటేయాలో తెలుసుకోవడం సామాన్యులకు కష్టమవుతోంది. విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, తిరుపతివంటి ప్రధాన నగరాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది. ఉభయగోదావరి, శ్రీకాకుళం, విజయనగరం, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లోని కొన్ని పురపాలక సంఘాల్లో పలువురు ప్రజలు తమ ఓటు ఏ వార్డులో ఉందో తెలుసుకోడానికి అవస్థలు పడుతున్నారు.
సందేహాల నివృత్తికి సహాయ కేంద్రాలు
ఎస్ఈసీ రమేశ్ కుమార్
‘ఓటర్ల సందేహాల నివృత్తి కోసం ప్రతి పుర, నగరపాలక సంస్థల్లో సహాయ కేంద్రాలు ఏర్పాటుచేయించాం. ప్రజలు వీటిలో సంప్రదించి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. వార్డుల పునర్విభజనలో ఒక ప్రాంతానికి చెందిన ఓట్లు మరో ప్రాంతంలో చేరిన విషయం ఎన్నికల సంఘం దృష్టికి వచ్చింది. సమయం తక్కువగా ఉన్నందున ఇలాంటి సమస్యల పరిష్కారానికి సహాయ కేంద్రాలు ఏర్పాటుచేయించాం. పోలింగ్ కేంద్రం కూడా ఎక్కడుందో తెలుసుకోవడానికి ఎన్నికల సంఘం, పురపాలక శాఖ వెబ్సైట్లలో ప్రత్యేకంగా లింకు ఏర్పాటుచేశాం’.
ప్రధానాంశాలు
దేవతార్చన

- Curfew: తెలంగాణలో నేటి నుంచి రాత్రి వేళ!
- మీ పేరుపై ఎన్ని ఫోన్ నంబర్లున్నాయో తెలుసుకోండి
- తొలుత జ్వరం అనుకుని.. చివరి నిమిషంలో మేల్కొని..
- కొవిడ్-19 ఎందుకింత ఉద్ధృతం?ఎప్పుడు ప్రమాదకరం?
- Corona Vaccine : 44 లక్షల డోసులు వృథా
- Horoscope: ఈ రోజు రాశి ఫలం
- భారత్లో వ్యాక్సిన్లకు అమెరికా అడ్డుపుల్ల..!
- కార్చిచ్చులా కరోనా
- India Corona: కాస్త తగ్గిన కొత్త కేసులు
- ఆ డేటా ఫోన్లో ఉంటే డిలీట్ చేయండి: ఎస్బీఐ