పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గాయి..ఎక్కడంటే? - assam cuts fuel prices
close

Published : 12/02/2021 19:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గాయి..ఎక్కడంటే?

అసెంబ్లీ ఎన్నికల సమీపిస్తున్న వేళ ..అసోం నిర్ణయం 

గువహటి: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ..చమురు మంటల నుంచి అసోం ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఊరటనిచ్చింది. పెట్రోల్‌, డీజిల్‌పై 5 రూపాయల మేర తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా మద్యంపై 25 శాతం సుంకాన్ని తగ్గించింది. ఈ అర్ధరాత్రి నుంచి కొత్త ధరలు అమల్లోకి వస్తాయని ప్రభుత్వం వెల్లడించింది. 

అసోం ఆర్థిక మంత్రి హిమంత బిశ్వా శర్మ శుక్రవారం అసెంబ్లీలో దీనిపై ప్రకటన చేశారు. ‘కొవిడ్ తీవ్రత అధికంగా ఉన్న సమయంలో పెట్రోల్‌, డీజిల్, మద్యంపై అదనపు సెస్‌ విధించాం. ఇప్పుడు కొవిడ్‌ బాధితుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. పెట్రోల్, డీజిల్‌పై ఐదు రూపాయల మేర, మద్యంపై 25 శాతం పన్ను తగ్గింపు ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కొత్త ధరలు ఈ అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ నిర్ణయం రాష్ట్ర ప్రజలకు లబ్ధి చేకూర్చనుంది’ అని మంత్రి వెల్లడించారు. అలాగే కొత్త ఆర్థిక సంవత్సరంలో మొదటి ఆరు నెలల కోసం ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ ఏడాది మార్చి-ఏప్రిల్‌లో అసోంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. సర్బానంద సోనోవాల్‌ నేతృత్వంలోని భాజపా ప్రభుత్వం మరోసారి అధికారాన్ని చేపట్టేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తోంది. దానిలో భాగంగా రాష్ట్ర ప్రజలకు ఈ తాయిలాన్ని ప్రకటించింది.

ఇవీ చదవండి:

మొబైళ్లకు అతుక్కుపోతున్నాం..మనమే టాప్‌

ఫిబ్రవరి 15 వచ్చేస్తోంది..ఫాస్టాగ్ తీసుకున్నారా?
 


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని