క్రికెట్‌కు ఉమర్‌గుల్‌ వీడ్కోలు - Umar Gul announces retirement from cricket
close
Updated : 17/10/2020 08:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

క్రికెట్‌కు ఉమర్‌గుల్‌ వీడ్కోలు

(Photo: Umar gull twitter)

ఇంటర్నెట్ డెస్క్‌: పాకిస్థాన్‌ పేస్‌ బౌలర్ ఉమర్‌ గుల్‌ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 36ఏళ్ల గుల్‌ అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్‌ తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. ‘నా క్రికెట్‌ ప్రయాణాన్ని ఎంతో ఆస్వాదించాను. నా దేశానికి ప్రాతినిధ్యం వహించినందుకు ఎంతో గర్వపడుతున్నాను. కృషి, సంకల్పం, నిబద్ధత, గౌరవ విలువలను నేను క్రికెట్‌ నుంచే నేర్చుకున్నాను. ఈ ప్రయాణంలో నాకు మద్దతు ఇచ్చి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు. ఇన్నేళ్ల నా క్రికెట్‌ ప్రయాణంలో వాళ్లే నాకు స్పూర్తి. వాళ్లు నాకోసం ఎంతో త్యాగం చేశారు. ఇక నుంచి నేను వాళ్లను మిస్‌ అవుతాను’ అని గుల్‌ ఉద్వేగానికి గురయ్యాడు.
2003లో జింబాంబ్వేపై మ్యాచ్‌తో వన్డేల్లో అరంగేట్రం చేశాడు గుల్‌. అదే ఏడాది బంగ్లాదేశ్‌తో తొలి టెస్ట్‌ మ్యాచ్‌ ఆడాడు. పాకిస్థాన్‌ తరఫున మొత్తం 47 టెస్టు మ్యాచ్‌లాడిన గుల్‌ 163 వికెట్లు తీశాడు. 130 వన్డేల్లో 179వికెట్లు, 60 టీ20 మ్యాచుల్లో 85 వికెట్లు సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్‌ 2008 సీజన్‌లోనూ కోల్‌కతా జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 2016లో పాకిస్థాన్‌ తరఫున తన చివరి టీ20 మ్యాచ్‌ ఆడాడు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని