రాష్ట్రానికి అద్దె మైకులా పవన్‌‌: పేర్ని నాని - ap minister perni nani comments on pawan kalyan
close
Updated : 04/04/2021 16:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రాష్ట్రానికి అద్దె మైకులా పవన్‌‌: పేర్ని నాని

ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్‌ను ఆయన చదువుతున్నారు
జనసేనానిపై ఏపీ మంత్రి విమర్శలు

అమరావతి: జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ రాష్ట్రానికి అద్దెమైకులా తయారయ్యారని ఏపీ మంత్రి పేర్ని నాని ఎద్దేవా చేశారు. ఉత్తరాది భాజపా దక్షిణాదికి అన్యాయం చేస్తోందని గతంలో చెప్పిన పవన్‌.. ఇప్పుడు ఆ పార్టీకి మద్దతివ్వాలని కోరుతున్నారని ఆక్షేపించారు. తాడేపల్లిలోని వైకాపా కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో విగ్రహాల ధ్వంసం, రథాల దగ్ధం కేసుల్లో భాజపా ప్రమేయం ఉందేమోననే అనుమానం తమకు ఉందని.. అందుకే సీబీఐ విచారణ కోరినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని పేర్ని నాని ఆరోపించారు.

‘‘పవన్‌కల్యాణ్‌ అజ్ఞాతవాసే కాదు.. అజ్ఞానవాసి. వివేకా హత్య కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది. కేసును సీబీఐ చూస్తుంటే పవన్‌ సీఎం జగన్‌ను విమర్శిస్తున్నారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్‌ను పవన్‌ చదువుతున్నారు. భాజపా రాష్ట్ర సహ ఇన్‌ఛార్జ్‌ సునీల్‌ దేవ్‌ధర్‌ పంచాయతీ సర్పంచ్‌గా కూడా గెలవరు. ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని ఎందుకు నిలదీయరు?విశాఖ ఉక్కును అమ్మేస్తామంటున్నా భాజపాను ఎందుకు ప్రశ్నించరు?’’ అని పవన్‌ను పేర్ని నాని నిలదీశారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని