భారత విమానాలపై ఆస్ట్రేలియా నిషేధాజ్ఞలు! - australia bans passenger flights from india amidst covid surge in the country
close
Updated : 27/04/2021 13:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భారత విమానాలపై ఆస్ట్రేలియా నిషేధాజ్ఞలు!

సిడ్నీ: భారత్‌లో కరోనా వైరస్‌ రెండో దశ తీవ్రంగా విజృంభిస్తున్న తరుణంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌ నుంచి వచ్చే అన్ని ప్యాసింజర్‌ విమానాలపై తాత్కాలికంగా నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఆ దేశ ప్రధాని స్కాట్‌ మోరిసన్‌ మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ‘భారత్‌ నుంచి వచ్చే అన్ని ప్యాసింజర్‌ విమానాలపై తాత్కాలికంగా నిషేధం విధించేందుకు నిర్ణయించాం. మే 15 వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయి. కరోనా వైరస్‌ వ్యాప్తి ప్రభావం భారత్‌లో తీవ్రంగా ఉన్నందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు’ మోరిసన్‌ వెల్లడించారు. 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని