వివాహానికి ముందు రూల్‌ పెట్టుకున్నాం: ప్రియాంక - did you know priyanka chopra and nick jonas made this rule when they got married
close
Published : 05/02/2021 13:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వివాహానికి ముందు రూల్‌ పెట్టుకున్నాం: ప్రియాంక

భర్తతో ఉన్న ఒప్పందం బయటపెట్టిన నటి

ముంబయి: వివాహానికి ముందు నిక్‌జొనాస్‌కి తనకి మధ్య ఓ ఒప్పందం ఉందని నటి ప్రియాంక చోప్రా తెలిపారు. గ్లోబల్‌స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ నటి హాలీవుడ్‌ గాయకుడు నిక్‌జొనాస్‌ను 2018లో ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ జంట లాస్‌ ఏంజెల్స్‌లో నివాసముంటోంది. ఇక, పెళ్లి తర్వాత కూడా విభిన్నమైన కథాచిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తోన్న ప్రియాంక తాజాగా మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నిక్‌జొనాస్‌తో తనకున్న అనుబంధం గురించి వెల్లడించారు.

‘వివాహానికి ముందు వృత్తిపరమైన జీవితాల్లో బిజీగా ఉండడం వల్ల మేమిద్దరం వేర్వేరు ప్రాంతాల్లో ఉండేవాళ్లం. నేనైతే ఇటు భారత్‌తోపాటు అటు విదేశాల్లో కూడా ఉండాల్సి వచ్చేది. ఈ సమస్యకు పరిష్కారం కోసం మేమిద్దరం ఓ నియమం పెట్టుకున్నాం. అదేమిటంటే.. ఈ ప్రపంచంలో ఏ ప్రాంతంలో ఉన్నాసరే క్రమం తప్పకుండా ప్రతి మూడు వారాలకు ఒకసారి మేమిద్దరం కలవాలి. మాకు మేము సమయం కేటాయించుకోవాలి. సమన్వయంతో ప్రతి పనిని పూర్తి చేయాలి. ఇలా మేమిద్దరం ఒకరినొకరం గౌరవించుకుని మా బంధాన్ని ఏడడుగుల వైపు వచ్చేలా చేశాం’ అని నటి ప్రియాంక వివరించారు.

ఇదీ చదవండి

టాలీవుడ్‌లో బీటౌన్‌ లేడీస్‌ ‘కీ’ రోల్‌మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని