నీ స్నేహితుడే.. ప్రమాదకరమైన శత్రువు
close
Published : 25/07/2021 01:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నీ స్నేహితుడే.. ప్రమాదకరమైన శత్రువు

విశాల్‌, ఆర్య ప్రధాన పాత్రల్లో ఆనంద్‌ శంకర్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఎనిమి’. వినోద్‌ కుమార్‌ నిర్మాత. మృణాళిని రవి, మమతా మోహన్‌దాస్‌ నాయికలు. ప్రకాశ్‌ రాజ్‌ కీలక పాత్రధారి. విభిన్నమైన యాక్షన్‌ థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందింది. శనివారం ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. టైటిల్‌కు తగ్గట్లుగానే సినిమాలో విశాల్‌, ఆర్య శత్రువులుగా కనిపించనున్నట్లు టీజర్‌తో స్పష్టత ఇచ్చారు. ప్రచార చిత్రంలో శక్తిమంతమైన పోరాట ఘట్టాలు.. ఆసక్తిరేకెతించే ఛేజింగ్‌ సీన్లను చూపించారు. ఆఖర్లో ‘‘ప్రపంచంలోనే ప్రమాదకరమైన శత్రువు ఎవరో తెలుసా.. నీ గురించి అంతా తెలిసిన నీ స్నేహితుడే..’’అని ప్రకాశ్‌ రాజ్‌ చెప్పిన డైలాగ్‌ టీజర్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచింది.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని