రానా-త్రిష-బన్నీ వీడియో కాలింగ్‌
close
Published : 29/03/2020 19:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రానా-త్రిష-బన్నీ వీడియో కాలింగ్‌

స్వీయ నిర్బంధంలో..

చెన్నై: స్నేహితులు రానా దగ్గుబాటి, అల్లు అర్జున్‌ తనకు కంపెనీ ఇచ్చారని కథానాయిక త్రిష చెప్పారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. షూటింగ్‌లు కూడా ఆగిపోవడంతో సినీ ప్రముఖులు సైతం ఇంటికే పరిమితమయ్యారు. కాగా తనకు రానా, బన్నీ కంపెనీ ఇచ్చారని త్రిష ఓ పోస్ట్‌ చేశారు. వీడియో కాల్‌లో ముచ్చట్లు చెప్పుకున్నామని తెలుపుతూ స్క్రీన్‌ షాట్‌ను ఫాలోవర్స్‌తో పంచుకున్నారు. అంతేకాదు నటి వరలక్ష్మి శరత్‌కుమార్‌తోనూ త్రిష వీడియో కాల్‌ ద్వారా మాట్లాడారు.

త్రిష చాలా ఏళ్ల తర్వాత ఇటీవల తెలుగు సినిమా ‘ఆచార్య’కు సంతకం చేశారు. కొన్ని రోజులు షూటింగ్‌లో పాల్గొన్నారు. కానీ పలు కారణాల వల్ల ఆమె ప్రాజెక్టు నుంచి వైదొలిగారు. 2015లో వచ్చిన ‘లయన్‌’ ఆమె తెలుగులో నేరుగా నటించిన చివరి సినిమా. ఆ తర్వాత ఇన్నేళ్లకు ‘ఆచార్య’తో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారని అభిమానులు ఆనందపడ్డారు. కానీ అది నిజం కాలేదు. ప్రస్తుతం త్రిష చేతిలో ఐదు తమిళ చిత్రాలున్నాయి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని