కేరళలో లాక్‌డౌన్‌ తరహా ఆంక్షలు! - kerala govt imposes 48 hour lockdown like restrictions in view of covid 19 spike
close
Published : 25/04/2021 02:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కేరళలో లాక్‌డౌన్‌ తరహా ఆంక్షలు!

తిరువనంతపురం: కరోనా రెండో దశ ఉద్ధృతి కొనసాగుతున్న వేళ కఠిన ఆంక్షలు విధిస్తున్న రాష్ట్రాల జాబితా క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే పలు రాష్ట్రాలు రాత్రిపూట కర్ఫ్యూ, వారాంతపు లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నాయి. కేరళ సైతం 48 గంటల పాటు లాక్‌డౌన్‌ తరహా ఆంక్షలను విధించింది. ఎక్కడికక్కడ తనిఖీలు చేపడుతున్న పోలీసులు నిబంధనలు పాటించనివారిపై జరిమానాలు విధిస్తున్నారు. అత్యవసర, సరైన పత్రాలను చూపించిన వారిని మాత్రమే వదిలేస్తున్నారు. కొవిడ్‌ నేపథ్యంలో ఆర్టీసీ బస్సులు, వ్యాపార సముదాయాలు, కూరగాయల మార్కెట్లలో రద్దీ తగ్గింది. కేరళలో శుక్రవారం కొత్తగా రికార్డుస్థాయిలో 28 వేలకుపైగా కరోనా కేసులు నమోదవ్వగా.. కొవిడ్‌ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ సోమవారం అఖిలపక్ష భేటీ నిర్వహించనున్నారు. 

కరోనా కట్టడిలో భాగంగా.. పశ్చిమ బెంగాల్‌తో ఉన్న సరిహద్దులను ఒడిశా ప్రభుత్వం మూసివేసింది. బెంగాల్‌ సరిహద్దుల్లోని మూడు చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు చేపడుతున్న పోలీసులు ఆర్టీపీసీఆర్‌ నెగెటివ్‌ రిపోర్టు తెచ్చినవారినే బెంగాల్‌లోకి అనుమతిస్తున్నారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని